Valentine Special : కౌగిలింతలో.. ప్రేమ పుంత.. హ్యాపీ హగ్ డే..!

Valentine Special : కౌగిలింతలో.. ప్రేమ పుంత.. హ్యాపీ హగ్ డే..!

కౌగిలింత కేవలం లైంగిక ప్రేరణకు సంబంధించింది అనుకోవడం పొరపాటు. కౌగిలింత ప్రేమకు సంబంధించింది. కౌగిలింతతో 'లవ్ డ్రగ్' రిలీజ్ అవుతుంది. ఇది యూనివర్సల్ మెడిసిన్. అది ఏ బాధనయినా నయం చేస్తుంది. ఈ మెడిసిన్ తో చాలా లాభాలు న్నాయి. ఒంటరితనాన్ని పోగొడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. టెన్షన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. కౌగిలింత ఒక ప్రేమ భాష. రెండు హృదయాలు మాట్లాడుకునే భాష!.

 ఒక్క కౌగిలింత వెయ్యి మాటలతో సమానం. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలని అది చెప్తుంది. కౌగిలింత ఒక ధ్యానం వంటిది. అది భయాన్ని తగ్గిస్తుంది. మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. అనవసరమైన ఆలోచనలకు కళ్లెం కూడా వేస్తుంది. ఈ కౌగిలింత కేవలం ప్రేమి కులదే కాదు. తల్లీ బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ఇలా ప్రతి బంధానికి కౌగిలింత ఒక వంతెన లాంటిది. హగ్ చేసుకున్నప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో కౌగిలింతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ రోజు ( ఫిబ్రవరి 12) కౌగిలింత ద్వారా ప్రేమ గాఢతను వాలెంటైన్ కి తెలియజేస్తారు

ప్రపంచం నిన్ను వెలేసినప్పుడు, అందరూ కలిసి నిన్ను ఓడించినపుడు నీకు ఎక్కడికి పోవాలనిపిస్తుంది? నీకు ఓదార్పు లభించే చోటుకి... ఓటమిని ఎదిరించే చోటుకి వెళ్లాలనుకుంటారు. కచ్చితంగా అది నిన్ను ప్రేమించే కౌగిలే! మేడలు, అంతస్తులు ఎన్ని ఉన్నా.. అక్కడికే చేరుకుంటారు. నిన్ను సంరక్షిస్తున్నట్టు వారి చేతులు మిమ్మల్ని చుట్టి వేస్తాయి. అప్పుడు ముక్కలైన హృదయం కూడా ఆ కౌగిలింతలో పూర్తిగా అతుక్కుంటుంది. కౌగిలింతలో కురిసిన ప్రతి కన్నీటి చుక్క సంతోషాన్ని సాగు చేస్తుంది! మీరు మళ్లీ పుడతారు. ఆ కౌగిలే మీలో కొత్త శక్తి నింపుతుంది. ఆ కౌగిలే మిమ్మల్ని యుద్ధానికి సిద్ధం చేసి.. విజయం వైపు నడిపిస్తుంది.

-వెలుగు,లైఫ్-