ఆధ్యాత్మికం: ఇందిర ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏంచేయాలి..

ఆధ్యాత్మికం: ఇందిర ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏంచేయాలి..

ఏకాదశి.. ఈ తిథి నెలకు రెండు సార్లు ..ఏడాదికి 24 సార్లు వస్తుంది.  పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశి ఒక ప్రత్యేకత ఉంది.  బాధ్రపద మాసం కృష్ణ పక్షంలోవచ్చే ఏకాదశి ఇందిరా ఏకాదశి అంటారు. పితృపక్షంలో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మన పూర్వీకులు స్వర్గలోకాన్ని పొందుతారని ఆధ్యాత్మిక గ్రంధాల ద్వారా తెలుస్తుంది.  ఈ ఏడాది ఇందిరా ఏకాదశి సెప్టెంబర్​ 28 శనివారం వచ్చింది. ఆరోజు ఏ దేవుడిని పూజించాలి.. ఎలా అర్చించాలో తెలుసుకుందాం. . .

బాధ్రపద మాసం.. కృష్ణ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.  ఆరోజు ( సెప్టెంబర్​ 28) ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.అంతేకాదు పితృపక్షాల సమయంలో వచ్చే ఏకాదశి కావున.. స్వయంపాకం ఇస్తే పూర్వీకులు ఉత్తమలోకాలకు చేరుకుంటారని చెబుతున్నారు. ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు, ఉపవాసాలు విధివిధానాల ప్రకారం చేస్తారు. ఈ రోజున చేసే పూజలతో భక్తుల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. 

ఇందిరా ఏకాదశి తేదీ, సమయం

భాద్రపద పక్ష మాసంలో ఇందిరా ఏకాదశి తిథి, ముహూర్త ద్రుక్ పంచాంగ ఏకాదశి తిథి సెప్టెంబర్ 27 శుక్రవారం మధ్యాహ్నం 01:20 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 02:49 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకుంటారు. సెప్టెంబర్ 28  ఉపవాస దీక్ష చేయాలి

ఇందిరా ఏకాదశి పూజా విధానం

ఆరోజున బ్రహ్మమూర్త సమయానికి కాలకృత్యాలు తీర్చుకొని.. స్నానం చేసి .. శుభ్రమైన దుస్తులు ధరించాలి.. ఇంట్లో ఈశాన్యభాగంలో ఒక పీట వేసి దానిపూ విష్ణుమూర్తి చిత్రపటాన్ని కాని ప్రతిమను గాని ప్రతిష్ఠించాలి.  ఆ తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విష్ణుమూర్తికి షోడపోపచారాలతో పూజలు చేసి  పసుపు రంగు పూలను సమర్పించండి.  అలాగే తులసి ఆకులు సమర్పించండి.  అయితే తులసి ఆకులను ఆరోజు తెంచకూడదు.  ముందు రోజు శుక్రవారం కనుక ఆరోజు కూడా కోయకూడదు.  గురువారం కోసి ఉంచుకోండి. ఎందుకంటే శ్రీ మహావిష్ణవుకు పసుపురంగు అంటూ చాలా ప్రీతికరమైనదని విష్ణుపురాణంలో రుషిపుంగవులు పేర్కొన్నారు. 

ALSO READ | Under ground village: భూమిలో ఊరు .. రత్నాలకు నిలయం.... ఎక్కడ ఉందో తెలుసా..

ఏకాదశి రోజున విష్ణువుతోపాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు.  ఏకాదశి పూజలో తులసి ఆకులు ఉండాలి.  ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు.విష్ణుమూర్తికి నైవేద్యాలలో తులసిని తప్పకుండా చేర్చండి. విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడు అని నమ్ముతారు. 
హిందూ పురాణాల ప్రకారం ఆరోజు సెప్టెంబర్​ 28 (ఇందిరా ఏకాదశి) రోజున ఉపవాసం ఉంటే పూర్వీకులకు మోక్షం కలిగి,, స్వర్గం చేరుకుంటారని విశ్వశిస్తుంటారు.

ధూపం, దీపాలు వెలిగించి పరిసరాలను శుద్ధి చేయండి. దేవుడికి నైవేద్యంగా పండ్లు, స్వీట్లు లేదా సాత్విక ఆహారాన్ని సమర్పించండి. విష్ణు సహస్రనామం పఠించండి.  లేదంటే వినండి.   విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి. పూజానంతరం ప్రసాదం మీరు తిని ఇతరులకు ప్రసాదాన్ని పంచండి. పేదలకు దానం ఇవ్వండి. భజనలు, కీర్తనలు ఆలపించాలి. శ్రీమహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. 

ఇందిరా ఏకాదశి రోజున చదవాల్సిన మంత్రం


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన|
 యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
 ఓం శ్రీ విష్ణవే నమః । క్షమాయాచన సమర్పణ యామి ॥

ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరిస్తే మానసిక ప్రశాంతత, మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన భక్తులకు పుణ్యం దక్కడమే కాదు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. జాతకంలో దోషం ఉంటే పై మంత్రాన్ని 108 సార్లు పఠించి.. ఆ తరువాత 21 సార్లు నవగ్రహస్తోత్రాన్ని చదవండి.  పేదలకు అన్నంపెట్టి... వస్త్రదానం చేయండి. అలా చేస్తే ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి.