కార్తీక మాసం మొదలైంది. కార్తీకం నెల అంతా విశిష్టమైనది అయినా.. సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు. ఈ ఏడాది ( క్రోధి నామసంవత్సరం.. 2024 ) మొదటి కార్తీక సోమవారం) నవంబర్ 4 వ తేది... పవిత్రమైన నీలకంఠేశ్వరుడు.. పరమేశ్వరుడు.. భోళా శంకరుని పూజిస్తే ఏడేడు జన్మల పాపాలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు కార్తీక సోమవారం శివుని ఎలా ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయో చూద్దాం.
హిందువులు పూజించే శివుడు.. విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే నెల. తెల్లవారుజామునే చన్నీటి స్నానాలు చేసి.. దీపాలు వెలగిస్తారు.. నిత్య పూజ తరువాత కార్తీక పురాణం పఠిస్తారు. కార్తీక సోమవారం ( నవంబర్ 4) ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. కార్తీక సోమవారంనాడు నదీస్నానం... దీప దానం విశిష్ట ఫలితాలను కలుగజేస్తాయని పండితులు చెబుతున్నారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ నామస్మరణ చేస్తూ శివాలయాలను భక్తులు సందర్శిస్తారు.
కార్తీకమాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు. ఆరోజు ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని భక్తి శ్రద్దలతో పూజించాలి. తెల్లవారుజామున.. ప్రదోష కాలంలో స్వామికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా.. ఆరోగ్యం కుదుట పడుతుంది. తరువాత బిల్వార్చన చేయాలి. ఇలా చేయడం కైలాస దర్శనం వల్ల కలిగే ఫలితం లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు.
ALSO READ : వారఫలాలు (సౌరమానం) నవంబర్ 03 నుంచి నవంబర్ 09 వరకు
కార్తీక సోమవారం రోజు ( నవంబర్ 4) సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయనికి వెళ్లి పరమేశ్వరున్ని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని( om Namah Shivayya ) పఠించాలి.ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి.ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది.