కుంభమేళా 2025: మౌని అమావాస్య ( జనవరి 29) న పుణ్య స్నానం ఎందుకు చేయాలి.. పురాణాల్లో ఏముంది..

కుంభమేళా 2025:  మౌని అమావాస్య ( జనవరి 29) న పుణ్య స్నానం ఎందుకు చేయాలి.. పురాణాల్లో ఏముంది..

ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​ రాజ్ లో కుంభమేళా జరుగుతుంది. జనవరి 29 మౌని అమావాస్య పుణ్య తిథి.  మౌని అమావాస్య నాడు  పుణ్య నదుల్లో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు పుణ్య స్నానాలు చేయాలి?.. పురాణాల్లో ఏముంది.. పండితులు ఏం చెబుతున్నారు..  మౌని అమావాస్య రోజున గంగానది స్నానం చేయడం ఎందుకు అంత ముఖ్యమైనది..  దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. . .

మౌని అమావాస్య రోజున జరిగే మహా కుంభమేళా అమృత స్నానం సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా  స్నానమాచరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మౌని అమావాస్య రోజున  కుంభమేళా  సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో  జనసమూహం , ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ALSO READ | శివయ్యను దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..

 హిందూ మతంలో పితృ దేవతలను స్మరించుకుని.. వారికి తర్పణాలు ఇచ్చేందుకు  చాలా పవిత్రంగా భావిస్తారు.  పుణ్య నదుల్లో కాని .. కుంభమేళా జరిగే ప్రదేశంలో కాని.. గయ లో కాని పిండ ప్రదానం చేస్తే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం కుభమేళా ప్రయాగ్​ రాజ్​ లో జరుగుతుంది. ఆరోజున (జనవరి 29) దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించేందుకు ప్రయాగ్​ రాజ్​ కు వస్తారని ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం అంచనా వేస్తుంది.  ఈ రోజున పుణ్యనదుల్లో చేసే స్నానాన్ని అమృత స్నానం అంటారు. 

మౌని అమావాస్య ఎప్పుడు?

ఈ సంవత్సరం (2025)  మౌని అమావాస్య తేదీ జనవరి 28న సాయంత్రం 7:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ మరుసటి రోజు అంటే జనవరి 29 సాయంత్రం 6:05 గంటలకు ముగుస్తుంది. జనవరి 29న మౌని అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజున మౌని అమావాస్య ఉపవాసం కూడా పాటిస్తారు. మహా కుంభంమేళాలో అమృత స్నానం కూడా చేస్తారు.

 మౌని అమావాస్య ..గంగానది స్నానం ప్రాముఖ్యత

మౌని అమావాస్య రోజున ( జనవరి 29)  పితృదేవతలకు నైవేద్యాలు, పిండ ప్రదానం.. దానాలు కూడా చేస్తారు. ఆ రోజున గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పెద్దలు ఉత్తమలోకాలకు చేరుకోకుండా మధ్యలోనే ఉంటే.. ఆరోజు ( జనవరి 29) వారి పేరున నీళ్లు.. నువ్వులను.. తర్పణాలు వదిలితే ఉత్తమలోకాలకు చేరుకుంటారని  పండితులు చెబుతున్నారు. మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు గంగానదిలో స్నానం చేసే సంప్రదాయం ఉంది. మౌని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేయడం అమృతంలో స్నానం చేయడంతో సమానమని భావిస్తారు. మౌని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేసేవారికి అమృతంలో స్నానం చేసినంత ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.

హిందూ మతంలో గంగానదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి చేసే పాపాలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం, గంగానదిలో స్నానం చేయడం పవిత్రత సముద్ర మథనానికి సంబంధించినదని చెబుతారు. సముద్ర మథనం సమయంలో అమృతపు కుండ ఉద్భవించింది. దీని గురించి దేవతలకు, రాక్షసులకు మధ్య అమృత కలశం విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో కలశం నుండి కొన్ని నీటి చుక్కలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో పడ్డాయి. ఈ ప్రదేశాలలో ప్రవహించే నదుల నీరు అమృతం పడటం వల్ల స్వచ్ఛంగా మారింది. అందుకే పండుగలు, పౌర్ణమి, అమావాస్య వంటి తిథి దినాలలో గంగా స్నానం చేస్తారు.

మౌని అమావాస్య కథ

గరుడ పురాణం ప్రకారం..ఇది పురాతన కాలం నాటి విషయమని గరుడపురాణం ద్వారా . కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య చాలా ధార్మికురాలు... పతివ్రత.. గుణవంతురాలు.  దేవస్వామి  బ్రాహ్మణ దంపతులకు 7 కుమారులు  ఒక కుమార్తె ఉన్నారు.   దేవస్వామి తన కుమార్తె వివాహం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించినప్పుడు, జ్యోతిష్కుడు ఆ బ్రాహ్మణుని జాతకంలో గ్రహాల స్థితిని చూసి విచారకరమైన వార్త చెప్పాడు. నీకు అల్లుడుగా  నీచుడు.. దుర్మార్గుడు.. తల్లి దండ్రులను పట్టించుకోనివాడు.. భార్యను .. అత్తమామలను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడని చెబుతాడు.  అంతేకాదు పెళ్లి అయిన అనతి కాలంలోనే నీకుమార్తె వితంతువు అవుతుందని చెబుతాడు.  విధి అలా ఉంది.  దానిని ఎవరూ తప్పించలేరు కదా..అని జ్యోతిష్కులు చెబుతారు. 

ఏది జరగాలో శివుడి ఆఙ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.  కాలం గడిచిన తరువాత దేవస్వామి కుమార్తెకు  వివాహ వయస్సు రావడంతో  ... ఓ బ్రాహ్మణునకు  నరసింహుడు అనే వ్యక్తికి  ఇచ్చి పెళ్లి చేస్తారు.  నరసింహుడు చాలా దుష్టుడు.. చెడ్డవాడు అని తెలిసినా..అతని తల్లి దండ్రులు,, దాచిపెట్టి.. వివాహం అయిన తరువాత అయినా మారుతాడేమొనని.. గుణవంతురాలు.. వినయశీలి అయిన దేవస్వామి కుమార్తెను కోడలిగా తెచ్చుకున్నారు.

పెళ్లి అయిన తరువాత నరసింహుడు చెడు అలవాట్ల వలన మద్యం సేవిస్తూ.. మాంసం తినుచూ.. భార్యను కూడా తినమని బలవంతం పెట్టేవాడు. నిత్యం నరసింహుడు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు.  ఇలా ఉండగా నరసింహుడి ఆగడాలను భరించలేక  ... అతని తండ్రి చంపాడు.  ఇలా ఆయన చేసిన పాపాల వలన ఇటు స్వర్గానికి.. అటు నరకానికి వెళ్లలేక మధ్యలో ఊగిసలాడుతున్నాడు.  ఆ సమయంలో నరసింహుడి బాధ వర్ణనాతీతం.  ఇలా ఉండగా గంగా నదిలో నరసింహుడి తండ్రి పిండప్రదానం చేశాడు. అది కూడా మౌని అమావాస్య రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమలోకాలకు చేరుకున్నాడు.

 కుంభమేళాలో స్నానం అతి ముఖ్యమైన ఆచారం. అయితే, మకర సంక్రాంతి నుండి ప్రారంభించి ప్రతిరోజూ సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పవిత్ర స్నాన తేదీలు ఉన్నాయి. వీటిని ‘అమృత స్నానం’ అని పిలుస్తారు. జనవరి 29న జరిగే మౌని అమావాస్య మహా కుంభమేళాలో మూడవ పవిత్రమైన తేదీ అవుతుంది. మౌని అమావాస్య  కాకుండా వచ్చే నెల( ఫిబ్రవరి 2025)లో  మరో మూడు రోజులు ఉంటాయి..ఈ మూడు రోజులు ఫిబ్రవరి 3, అంటే బసంత్ పంచమి రోజు సోమవారం, ఫిబ్రవరి 12, అంటే మాఘ పూర్ణిమ.. ఫిబ్రవరి 26, అనగా మహా శివరాత్రి రోజున అమృత స్నానాలు ఆచరిస్తారు.