శివయ్యను దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..

శివయ్యను దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..

హిందువులందరూ దాదాపు ఏదో ఒక రోజు గుడికి వెళతారు.   శివాలయం.. వెంకటేశ్వరస్వామి గుడి. ..ఆంజనేయస్వామి దేవాలయం.. అమ్మవారి గుడి.. రామాలయం... ఇలా ఎవరికి నచ్చిన గుడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటారు.  కాని అన్ని దేవాలయాల్లోకి శివాలయంలో స్వామిని దర్శనం చేసుకునే విధానం వేరుగా ఉంటుందని పురాణాలు  చెబుతున్నాయి.  శివాలయంలో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు నియమాలున్నాయి..  శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి.  శివాలయంలో స్వామిని దర్శిస్తే అన్ని దేవుళ్లను దర్శించుకున్నట్లే నని పండితులు చెబుతుంటారు.  అందుకే దాదాపు  ప్రతి శివాలయం ప్రాంగణంలో అనేక ఉప దేవాలయాలు ఉంటాయి. 

శివాలయంలో శివుడు లింగాకారంలో ఉంటాడు.   దానికే అభిషేకం చేస్తాం.. పూజలు చేస్తాం.  శివ కళ్యాణం చేసేటప్పుడు మాత్రమే శివపార్వతుల చిత్రపటాన్ని లేదా శివ పార్వతుల విగ్రహాలను ఉపయోగిస్తారు. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం ఐదు ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది.  శివలింగానికి ఉండే ఐదు ముఖాలకు ఐదు పేర్లు కూడా ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. 

ALSO READ | Spiritual : భగవంతుడిని ఎందుకు స్మరించాలి.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఇదే..

శివలింగానికి ఉండే ఐదు ముఖాలు కూడా మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి.  అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం పూజించి తీరాల్సిందే.  అందుకే ఏ దేవాలయంలో ప్రదక్షిణం చేయకపోయినా శివాలయంలో మాత్రం తప్పకుండా ప్రదక్షణం చేయాలి. 

శివుడిని ప్రార్థిస్తే ...   కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.  శివాలయంలో పరమేశ్వరుడిని పశ్చిమాభిముఖంగా...  దర్శించుకున్నట్లయితే.. శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు.  అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి.  శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం.

తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు.  శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.  అంటే చీకటిలో ఉంచటం.  అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే.  ఏ మాత్రం అనుమానం లేదు.  మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా... అందుకే తూర్పుదిక్కున శివయ్యను దర్శించుకొనేటప్పుడు సద్యోజాతయ విద్మహే.. తత్​పురుషాయ ధీమహి.. తన్నో సర్వ: ప్రచోదయాత్​ అనే మంత్రాని పఠించాలి. 

శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు.  ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. 

అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరే ఘోరతరేభ్యః !
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః 

అనే మంత్రాన్ని దక్షి ణ దిక్కులో శివలింగాన్ని దర్శించుకునేటప్పుడు చదవాలి..కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం...

ఉత్తరం వైపు చూసే ముఖాన్ని "వామదేవ'' ముఖం అని అంటారు. ఉత్తరం వైపు చూసి "వామదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. శివపురాణం ప్రకారం .. విష్ణువు, శివుడు ఒకరే ... రెండు లేనే లేవు .. వామదేవ ముఖంలో ఉన్న శివలింగం విష్ణు స్వరూపం ..   శివపురాణంని రాసినది వేదవ్యాసుడు. ..వ్యాసుడే విష్ణువు ... విష్ణువే వ్యాసుడు. ..

వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే ... రెండు కాదు. 
చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. ..కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. ..మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. 
ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు....

ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, శివలింగం ప్రాముఖ్యత.. విశిష్టత గురించి తెలుసుకున్నాం.. ఇక చివరి ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని "ఈశాన ముఖం'' అంటారు. మనం లిగంపైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం  నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది.  శివలింగంలో ఈశానముఖం దర్శఙంచుకునేటప్పడు.. 

శివాయ విష్ణురూపాయ..శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః..ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి..తథా మే స్వస్తిరాయుషి

విష్ణురూపుడైన శివునికి, శివరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుని హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు. విష్ణువు శివమయుడైనట్లుగానే, శివుడు కూడా విష్ణుమయుడే. వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు నాకు శుభం, ఆయుష్షు కలుగుతాయి