ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది.. శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది. ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేర్వేరు పేరు .. విభిన్న ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో జేష్ఠ మాసంలో అంటే జూలై నెలలో ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి పూజా సమయం, శుభ ముహర్తం తదితర వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
యోగినీ ఏకాదశి ఉపవాసం నిర్జల ఏకాదశి తర్వాత .. దేవశయని ఏకాదశి అంటే తొలి ఏకాదశికి ముందు ఆచరిస్తారు. తెలుగు వారి క్యాలెండర్ ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది జూలై 2న యోగినీ ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి దేవశయని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది
హిందూ మతంలో త్రయోదశి తిథి లయకారుడైన శివునికి అంకితం చేసినట్లే.. ప్రతి ఏకాదశి తిథి ఉపవాసం కూడా సృష్టి పోషకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి రోజున ఉపవాసం చేపట్టి శ్రీ మహా విష్ణువును పూజించడం ద్వారా శ్రీ హరి విశేష అనుగ్రహం లభిస్తుంది. ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు.ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేర్వేరు పేరు .. విభిన్న ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో జేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు.
యోగిని ఏకాదశి 2024 శుభ సమయం ఎప్పుడంటే
- జేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ప్రారంభం – 1 జూలై 2024 ఉదయం 10:26 నుండి.
- కృష్ణ పక్ష ఏకాదశి తిథి ముగింపు – జూలై 2 ఉదయం 8:42 గంటలకు
- యోగిని ఏకాదశి ఉపవాస తేదీ – 2 జూలై 2024 మంగళవారం.
ఆరోగ్య కోసం యోగినీ ఏకాదశి
యోగినీ ఏకాదశి వ్రతం యువకులు లేదా పెద్దలు ఎవరైనా ఆచరించవచ్చు. ఎవరైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడాలనుకుంటే ఈ ఏకాదశి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. కుష్టు వ్యాధితో సహా ఏవైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం వలన ఫలితాలు లభిస్తుందని విశ్వాసం. ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ప్రతిఫలదాయకం, అన్ని గత జన్మ పాపాలను, చెడు పనుల వలన కలిగే దోషాలను తొలగిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
యోగిని ఏకాదశి ప్రాముఖ్యత
యోగిని ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామ స్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పొందుతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మ పురాణం చెబుతోంది.
యోగినీ ఏకాదశి సందర్భంగా…ఉపవాసం ఉండడం వల్ల పుణ్యం వస్తుందని అంటుంటారు. ఉపవాసాలు, పూజలు చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని వారి వారి విశ్వాసం. ఓం నమో నారాయణయ ..హిందువుల విశ్వాసం ప్రకారం..యోగినీ ఏకాదశి పాటించడం చాలా ముఖ్యమైందని అంటుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేస్తారు. ఆరోగ్య వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి అతి ముఖ్యమైన ఏకాదశిగా చెబుతుంటారు.
ఆడవారైనా..మగవారైనా పాపాల నుంచి విముక్తి పొందడమే కాకుండా..అనేక వ్యాధుల నుంచి ఉపశమనం, మంచి ఆరోగ్యం వస్తుందని అంటుంటారు. యోగినీ వ్రతాన్ని ఒక్కసారైనా ఆచరిస్తే..శ్రేయస్సు, ఆరోగ్యం, విజయం లభిస్తుందంటున్నారు. విష్ణుమూర్తిని పూజిస్తుంటారు. ఉపవాస నియమాలు పాటించడం, విష్ణు సహస్త్ర నామాలు పటించాలని చెబుతుంటారు. అంతేగాకుండా..తోచిన విధంగా దానాలు చేయాలంటుంటారు.
యోగిని ఏకాదశి పురాణ కథ( పద్మపురాణం ప్రకారం)
పురాణాల ప్రకారం..హేమమాలి అనే తోటమాలికి అందమైన భార్య విశాక్షి ఉండేది. అనకాపురి రాజ్యంలో ఒక ఉద్యానవన తోటమాలిగా బాధ్యతలు నిర్వహించే వాడు హేమమాలిని. రాజు కుబేరుడు. రాజు శివుడు భక్తుడు. పూజలు, ప్రార్థనలు చేసేవాడు. మానస సరోవరం నుంచి తాజా పూలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ పూలతో కుబేరుడు..శివుడిని ప్రార్థించేవాడు. ఓ రోజు కుబేరుడికి పూలు తీసుకరాలేదు. ఎందుకు ఆలస్యం అయ్యిందని భటులను హేమమాలి వద్దకు పంపిస్తాడు. ఆ సమయంలో హేమమాలి..తన భార్యతో ఉంటాడు.
ఇదే విషయాన్ని రాజుకు చెబుతారు భటులు. వెంటనే హేమమాలిని పిలిపించుకుంటాడు. కుష్టు వ్యాధితో బాధ పడాలని..భార్య నుంచి విడిపోవాలని హుకుం జారీ చేస్తాడు. అడవిలో కుష్టు వ్యాధితో బాధ పడుతుంటాడు. అక్కడ మార్కండేయ ఆశ్రమానికి చేరుకుంటాడు. శాపానికి సంబంధించిన విషయాలు చెబుతాడు. శాప విముక్తి కలిగించాలని మునిని కోరుతాడు.
ఆషాడ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష ఉండాలని..విష్ణుమూర్తిని పూజించాలని చెబతాడు. అత్యంత శ్రద్ధ, భక్తితో పూజలు చేస్తాడు. విష్ణుమూర్తి ఆశీస్సులు పొంది..శాపం నుంచి విముక్తి వస్తుంది. పూర్వ రూపం రావడమే కాకుండా..భార్యతో సంతోషకరమైన జీవితం గడుపుతాడు