సీతానవమి పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే

సీతానవమి పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే

 సీతా నవమిని ( మే 16)  దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్దయెత్తున జరుపుకుంటారు. సీతా జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు చేసుకుంటారు. శ్రీరాముడి భార్య సీతాదేవి స్వచ్ఛతకు, నిజాయతీకి నిలువెత్తు రూపం. సీతాదేవిని జానకీదేవి గా కూడా కొలుస్తారు. ఆ రోజున పవిత్ర నదీస్నానం ఆచరించి సీతాదేవి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీ. ఈ పండగ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలేంటంటే..

హిందూ పురాణాల ప్రకారం, సీతాదేవి జనక మహారాజు, రాణీ సునయనల పుత్రిక. జనకుడు తన పొలాన్ని యాగం కోసం దున్నుతుండగా ఒక బంగారపు పెట్టెలో ఒక పాపను చూస్తాడు. తనని దత్తత తీసుకొని సీత అని నామకరణం చేస్తాడు. తరువాత సీతా కళ్యాణం అయోధ్య రాజు శ్రీ రాముడితో జరుగుతుంది. వాళ్లిద్దరి దాంపత్యం ప్రతి పెళ్లైన జంటకు ఒక స్ఫూర్తి. ప్రేమ, నిజాయతీ, త్యాగాల గురించి సీతారాముల కథ చెబుతుంది. వాళ్లకు కూడా కష్టాలు తప్పలేదు. రాముడు 14 ఏళ్ల అరణ్య వాసానికి వెళ్లినపుడు సీతాదేవి, లక్షణులు రాముని వెంటే వెళ్లారు. తరువాత రావణుడు సీతాదేవిని అపహరించడం, రాముడు రావణున్ని ఓడించి సీతాదేవిని కాపాడటం జరిగింది.

పంచాంగం ప్రకారం,  ఈ ఏడాది (2024) వైశాఖ మాసం తొమ్మిదవ తేదీ శుక్ల పక్షం మే 16, గురువారం ఉదయం 6:22 గంటలకు ప్రారంభమై మే 17, శుక్రవారం ఉదయం 08:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం, సీతా నవమి పండుగ మే 16 న జరుపుకుంటారు. సీతా నవమి రోజున మే 16వ తేదీ ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 01:43 గంటల వరకు సీతామాతని పూజించడానికి అనుకూలమైన సమయని పండితులు చెబుతున్నారు.

సీతా నవమి ప్రాముఖ్యత పురాణాల ప్రకారం, సీతారాములకు లవుడు, కుశుడు అనే ఇద్దరు కుమారులున్నారు. వివాహిత స్త్రీలు సీతానవమి రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. సీతానవమి రోజున సీతారాములను పూజించిన వారికీ అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజున సీతామాతను పూజించడం వల్ల తీర్థయాత్రలు, దానధర్మాల చేసినప్పుడు కలిగిన ఫలం కంటే అధిక ఫలితం దక్కుతుందని నమ్మకం. దంపతులు  వైవాహిక జీవితంలోని కష్టాలను తొలిగి..  సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని నమ్మకం.

సీతాదేవిని స్వచ్ఛతకు, పవిత్రతకు స్వరూపమని నమ్ముతారు. కుటుంబం కోసం ఆమె చేసిన త్యాగాలను గౌరవించి, ఆమెను కొలుస్తారు. ఈరోజు మహిళలు సీతాదేవి ఆశీర్వాదాలు వాళ్ల కుటుంబం మీద ఉండాలని ఉపవాసం స్వీకరిస్తారు. సీతానవమి చాలా ఆడంభరంగా పెద్దయెత్తున జరిగే వేడుక. భక్తులు నదిలో పవిత్ర స్నానం చేసి మంత్ర జపాలతో రోజును ప్రారంభిస్తారు. మహిళలు రోజు మొత్తం ఉపవాసం ఉండి సీతాదేవిని కొలుస్తారు. తరువాతి రోజు ఉపవాసం విరమిస్తారు.

ప్రతి సంవత్సరం వైశాఖ మాసం(Vaisakha Maas) శుక్ల పక్షం తొమ్మిదవ రోజున  సీతా నవమిగా జరుపుకుంటారు.  ఈరోజు సీతమ్మ పుట్టినరోజన నమ్మకం. సీతా నవమి..  శ్రీ రామ నవమి(Srirama navami) తర్వాత ఒక నెలకు వస్తుంది. ఈ రోజున సీత మాత దర్శనమిస్తుందని ప్రతీతి. ఈ రోజును జానకీ నవమి లేదా సీతా జయంతి ( సీతా నవమి 2024 )గా జరుపుకుంటారు. ఈరోజున సీతారాములను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు. తాము సుమంగళిగా జీవిస్తామని.. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని నమ్మకం.  ఈ సంవత్సరం సీతా నవమి మే 16 న వచ్చింది.

సీతా నవమి పూజా విధానం సీతా నవమి నాడు తెల్లవారు జామునే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. ఇంటిని, పూజగదిని శుభ్రంచేసుకోవాలి. ఒక పీఠం ఏర్పరచుకుని పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని వేసుకోవాలి. అనంతరం సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్టించాలి. సీతాదేవికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, జాకెట్ వంటి మంగళకరమైన వస్తువులను సమర్పించాలి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అక్షతలు, ఎరుపు, పసుపు పుష్పాలు, ధూపం మొదలైన వాటితో పూజించండి. ఓం సీతాయై నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి.  నైవేద్యంగా ఆహారపదార్ధాలను సమర్పించండి.