SIIMA అవార్డ్స్ 2023(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతి సంవత్సరం కండక్ట్ చేయబడతాయి. ఇది అత్యంత గుర్తింపు పొందిన అవార్డు గా భావిస్తారు. ఈ ఏడాది 2023 సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. లేటెస్ట్ గా ఉత్తమ తెలుగు గేయ రచయితల(Lyricist) నామినేషన్ల లిస్ట్ ను ప్రకటించింది సైమా.
ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఇలా పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న నాటు నాటు (RRR) సాంగ్ ను చంద్రబోస్(Chandrabose) లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ఎంతో ఫేమస్ అయింది. అలాగే ప్రేమికుల హృదయాలను కట్టిపడేసిన సీతారామం మూవీ సాంగ్స్ అన్నీ హైలెట్ గా నిలిచాయి.కాగా ఈ మూవీ నుంచి ఇంతందం అనే సాంగ్ కు కృష్ణకాంత్(krushnakant) లిరిక్స్ అందించారు.
SIIMA 2023 Best Lyric Writer | Telugu
— SIIMA (@siima) August 11, 2023
1: @boselyricist for #NaatuNaatu (RRR)
2: @kk_lyricist for #Inthandham (Sita Ramam)
3: @mmkeeravaani for #NeethoUnteChalu (Bimbisara)
4: @ramjowrites for #LaaheLaahe (Acharya)
5: #SuddalaAshokTeja for #KomuramBheemudo (RRR)
Vote for your… pic.twitter.com/eQjMaHocN9
ఇక RRR వంటి ఇంటర్నేషనల్ మూవీస్ తో పాటు..బింబిసారా వంటి మూవీకు అద్దిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు కీరవాణి(Keeravani).ఈ మూవీ నుంచి నీతో ఉంటే చాలు సాంగ్ నామినేట్ అయింది. కాగా చిరంజీవి,చరణ్ నటించిన ఆచార్య నుంచి రామజోగయ్య(Ramajogayya) రచించిన లాహె లాహె పాట తో పాటుగా..RRR నుంచి సుద్దాల(Suddala Ashok Teja) రాసిన కొమురం భీముడో సాంగ్ నామినేట్ అయ్యింది. ఈ సాంగ్ యావత్ ప్రపపంచాన్ని కన్నీరు పెట్టేలా చేశారు రాజమౌళి, ఎన్టీఆర్. ఈ పాటలోని పాదాలకు ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచి వావ్ అనిపించుకున్నారు.
SIIMA అవార్డ్స్ ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చలనచిత్ర పరిశ్రమల నుండి దక్షిణ భారత చలనచిత్రాలలో బెస్ట్ పెర్ఫామెన్స్ కనబరిచిన మూవీస్ కు, డైరెక్టర్స్, హీరోస్, రైటర్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వారికి ఈ అవార్డ్స్ ను అందిస్తారు.