సికందర్‌ మూవీ రీమేక్ కాదు.. ఒరిజినల్ స్టోరీ : మురుగదాస్

సికందర్‌ మూవీ రీమేక్ కాదు.. ఒరిజినల్ స్టోరీ : మురుగదాస్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన  చిత్రం ‘సికందర్‌‌‌‌’. తమిళ దర్శకుడు ఏఆర్‌‌‌‌ మురుగదాస్ డైరెక్షన్‌‌లో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఇదొక రీమేక్ మూవీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు మురుగదాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని, కంప్లీట్ ఒరిజినల్ స్టోరీ అని కన్‌‌ఫర్మ్ చేశాడు. 

ఇందులోని ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ చాలా స్పెషల్‌‌గా రూపొందించామని, ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ అందిస్తుందని చెప్పాడు.  అలాగే ఇందులోని ఎమోషన్‌‌కు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుందని అన్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రంతో  కాజల్ అగర్వాల్  బాలీవుడ్‌‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమిళ నటుడు సత్యరాజ్‌‌ విలన్‌‌గా కనిపించనున్నాడు. శర్మన్ జోషి, కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఈద్‌‌కు రాబోతున్న ఈ చిత్రం విజయంపై నమ్మకంగా ఉన్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.