పసికూన ఆటగాడు అనుకున్నారు.. కోహ్లీ రికార్డునే సమం చేసాడు

పసికూన ఆటగాడు అనుకున్నారు.. కోహ్లీ రికార్డునే సమం చేసాడు

T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ 2023లో భాగంగా ఆదివారం(నవంబర్ 27) జింబాబ్వే, రువాండా మధ్య జరిగిన మ్యాచ్ లో 114 పరుగుల భారీ తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. ఈ మ్యాచ్  మొత్తం ఆల్ రౌండర్ సికందర్ రజా హవానే నడించింది. మొదట బ్యాటింగ్ లో 36 బంతుల్లో 58 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన రాజా.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ హ్యాట్రిక్ తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు కోహ్లీ రికార్డ్ ఒకటి సమం చేసాడు. 

2023 అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ ఆరు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తాజాగా సికిందర్ రాజా ఆరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి కోహ్లీతో సమంగా నిలిచాడు. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతుండడంతో ఈ జింబాబ్వే ఆల్ రౌండర్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న సికిందర్ రాజా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. 

ఐపీఎల్ 2023 లో పంజాబ్ కింగ్స్ పై ఆడిన రాజా.. చెన్నైపై మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడి అందరి దృష్టిలో పడ్డాడు.సికిందర్ రాజా ఆల్ రౌండర్ ప్రదర్శనకు తోడు మారుమణి 50 పరుగులు చేసాడు. ఇక చివర్లో ర్యాన్ బర్ల్ 21 బంతుల్లో 44* పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే నాలుగు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రుగాండ 71 పరుగులకే ఆలౌటైంది. అంగరవ, రాజా 3 వికెట్లు తీసుకోగా.. ర్యాన్ బర్ల్ రెండు వికెట్లు తీసుకున్నాడు.