Sikandar Raza: చివరి బంతికి ఆరు పరుగులు..సంచలనం సృష్టించిన జింబాబ్వే క్రికెటర్

ఒక్క ఓవర్లో 20 కొట్టాల్సిన సాధారణ విషయం ఏమో కానీ ఒక్క చివరి బంతిని సిక్సర్ గా మలిచి గెలిపించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. చరిత్ర చూసుకుంటే ఇలా జరిగిన సందర్భాలు వేళ్ళ మీదే లెక్కపెట్టుకోవచ్చు. అయితే తాజాగా జింబాబ్వే ఆల్ రౌండర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో భాగంగా చివరి బంతికి సికిందర్ రాజా సిక్సర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. 

దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్ లో 13 పరుగులు అవసరమయ్యాయి.  UAE కి చెందిన 19 ఏళ్ల మీడియం పేసర్ అలీ నసీర్ వేసిన ఈ చివరి  ఓవర్ లో తొలి 5 బంతులకు కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్లో బంతులు వేస్తూ అద్భుతంగా కట్టడి చేశాడు. అయితే చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైనప్పుడు రజా లాంగ్ ఆఫ్ లో సిక్సర్ బాది దుబాయ్ క్యాపిటల్స్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఈ మ్యాచ్ లో రజా 45 బంతుల్లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లతో 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.    

మొదట బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. హేల్స్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. ఇక లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ చివరి బంతికి విజయం సాధించింది. సామ్ బిల్లింగ్స్ (57) సికిందర్ రాజా (60) హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి బంతికి సిక్సర్ కొట్టడంతో.. పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసిన  సికిందర్ రాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.