IPL 2024: ఐపీఎల్‌కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్

IPL 2024: ఐపీఎల్‌కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆల్ రౌండర్ సికందర్ రజా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం జింబాబ్వేకు వెళ్ళిపోయాడు. ఐపీఎల్ లో రాజా పంజాబ్ కింగ్స్ తరపున కేవలం రెండే మ్యాచ్ లాడి 43 పరుగులు చేశాడు. ప్రపంచంలో టాప్ ఆల్ రౌండర్లలో ఒకరైన రజా.. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కించు కోలేకపోయాడు.      

బంగ్లాదేశ్ తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్ జింబాబ్వేకు ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి టీ20 మే 3న ప్రారంభం కానుంది. మే 12 న చివరిదైన 5 టీ20 మ్యాచ్ జరుగుతుంది.  ఈ సిరీస్ తర్వాత రజా మళ్ళీ జట్టులో కలిసే అవకాశం ఉంది. మే 15న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పంజాబ్ మ్యాచ్‌కు.. మే 19న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పీబీకేఎస్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లకు ఈ జింబాబ్వే ఆల్ రౌండర్ జట్టులో చేరతాడు.

భారత్ ను వదిలి వెళ్తున్న వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “ఐపీఎల్ లో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్‌కు ధన్యవాదాలు. నా ఐపీఎల్ ప్రయాణంలో ప్రతి నిమిషం ఎంజాయ్ చేసాను. ఇప్పుడు దేశానికి ఆడాల్సిన సమయం వచ్చింది. త్వరలో మనం మళ్ళీ కలుద్దాం.”అని తెలియజేశాడు. 

Also Read:మెక్‌గుర్క్ సంచలన బ్యాటింగ్.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
 
పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరే అవకాశం చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున రజా భారత్ లోకి తిరిగి అడుగుపెట్టడం కష్టంగానే మారయింది. ప్రస్తుతం పంజాబ్ 9 మ్యాచ్ ల్లో మూడు విజయాలను సాధించింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే మిగిలిన 5 మ్యాచ్ ల్లోనూ గెలిచి తీరాల్సిన పరిస్థితి.