వరుసగా 5 హాఫ్ సెంచరీలు.. టీ20ల్లో సికిందర్ రాజా సరికొత్త చరిత్ర

వరుసగా 5 హాఫ్ సెంచరీలు.. టీ20ల్లో సికిందర్ రాజా సరికొత్త చరిత్ర

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ క్రికెట్ లో తన టాప్ ఫామ్ కొసాగిస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో ఈ ఆల్ రౌండర్ అదే పనిగా చెలరేగుతున్నాడు. బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ, బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తున్నాడు. జట్టు గెలుపుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. టీ20 ఆల్ రౌండర్లలో సికిందర్ మించిన వారు లేరనడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. నిన్న శ్రీలంకతో జరిగిన టీ 20 లో జింబాబ్వే చివరి బంతికి ఓడిపోయినా రాజా అదరగొట్టాడు. 

మొదట బ్యాటింగ్ లో 42 బంతుల్లో 64 పరుగులు చేసిన ఈ స్టార్ ఆటగాడు.. ఆ తర్వాత బంతితోనే చెలరేగి 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. గత కొంతకాలంగా రాజా టీ20 క్రికెట్ లో అత్యంత నిలకడ చూపిస్తున్నాడు. రాజా చివరి ఐదు టీ20 మ్యాచ్ లు చూసుకుంటే వరుసగా బ్యాటింగ్ లో 58, 65,82,65,62 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లోనూ చివరి ఐదు మ్యాచ్ ల్లో 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ వైపు స్పెషలిస్ట్ బ్యాటర్ గా అదరగొడుతూనే మరోవైపు స్పెషలిస్ట్ బౌలర్ గా సత్తా చాటి పరిపూర్ణ ఆల్ రౌండర్ గా నిలిచాడు.          
 
రజా టీ20 కెరీర్ లో ఇప్పటివరకు 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లు గెలుచుకున్నాడు. ఈ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే కోహ్లీ రికార్డ్ త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంతకముందు రాజా వరుసగా నాలుగు సార్లు టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం విశేషం. మరి టీ20 క్రికెట్ లో  రాజా జోరు ఇప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.