ఒట్టావా: కెనడాలో భారతీయ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందిన న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ( అక్టోబర్ 19) రాత్రి హాలాఫాక్స్ సిటీలో వాల్ మార్ట్ స్టోర్ బేకరీ డిపార్ట్ మెంట్ వాక్ ఇన్ ఓవెన్ లో 19యేళ్ల సిక్క మహిళ శవమై కనిపించింది.
ఓ గుర్తు తెలియన మహిళ హాలిఫాక్స్ ప్రాంతంలోని వాల్ మార్ట్ స్టోర్ లో పనిచేస్తుందని... శనివారం రాత్రి ఆమె హఠాత్తుగా చనిపోయారని స్థానిక పోలీసులు చెబుతు న్నారు.
మృతి చెందిన మహిళ ఇటీవల ఇండియానుంచి కెనడాకు వచ్చిందని .. ఆమె సిక్కు సంఘానికి చెందినవారని కెనడా మారిటైమ్ సిక్క్ సొసైటీ తెలిపింది. సిక్కు మహిళ మృతికి కారణాలపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ పనిచేస్తున్న వాల్ మార్ట్ షాపును మూసివేశారు.
ALSO READ | నువ్వు మా రాజువి కాదు...కింగ్ చార్లెస్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ సెనేటర్ నినాదాలు
అయితే సిక్కు మహిళ మృతికి సంబంధించిన న్యూస్ స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ జరుగుతోంది. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని స్థానిక పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను కోరారు.