భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కేంద్రాలలో ఒకటైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హిమాలయ రాష్ట్రంలోని ఆకస్మిక వరదల కారణంగా సిక్కింలోని సౌత్ లొనాక్ సరస్సు ఆకారాన్ని మారుస్తున్న చిత్రాలను చూపించింది. సిక్కింలోని సౌత్ ల్హోనాక్ సరస్సు ఉద్దృతిపై ఉపగ్రహ చిత్రాలను రిలీజ్ చేసింది.
"సరస్సు విస్ఫోటనం చెందిందని, దాదాపు 105 హెక్టార్ల విస్తీర్ణం ఖాళీ చేయబడిందని ఈ చిత్రాల ద్వారా తెలుస్తోంది" అని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. శాటిలైట్ డేటాను ఉపయోగించి సరస్సును మరింత పర్యవేక్షించడం కొనసాగిస్తామని అంతరిక్ష సంస్థ తెలిపింది. సిక్కింలో వరదలు విధ్వంసం సృష్టించడంతో 14 మంది మరణించారు. 23 మంది ఆర్మీ సిబ్బంది సహా దాదాపు 102 మంది అదృశ్యమయ్యారు.
భారత సైన్యం సిక్కింలో తన సొంత సైనికులతో సహా తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాల కోసం మూడు హెల్ప్‌లైన్‌లను ప్రారంభించింది.
- ఉత్తర సిక్కిం ఆర్మీ హెల్ప్‌లైన్ - 8750887741
- తూర్పు సిక్కిం ఆర్మీ హెల్ప్‌లైన్ - 8756991895
- తప్పిపోయిన సైనికులఆర్మీ హెల్ప్‌లైన్ - 7588302011
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విపత్తు తర్వాత, తీస్తా నది పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరద కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి పిఎస్ తమాంగ్ సింగ్‌టామ్‌ను సందర్శించారు. సింగతం నగర పంచాయతీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. "ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సేవలు కేటాయించబడ్డాయి. నష్టాలను అంచనా వేయడానికి, స్థానిక కమ్యూనిటీతో చర్చించేందుకు నేను వ్యక్తిగతంగా సింగ్‌టామ్‌ని సందర్శించాను" అని ఆయన 'X'లో తెలిపారు.