విభజన హామీలు నెరవేర్చకుంటే ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్ష

  • ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ ఢిల్లీలోని రాజ్ ఘట్ దగ్గర దీక్షకు దిగనున్నట్లు తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ల్. ఏపీ విభజన చట్టంలో 30 అంశాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చడంలేదన్నారు. మౌన దీక్షకు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశారు కేఏ పాల్. బుధవారం రోజు జంతర్ మంతర్ లో ధర్నాకు దిగుతున్నట్లు తెలిపారు. నా జీవితంలో మొదటి సారిగా రాజ్ ఘాట్ లో 3 గంటల దీక్షకు దిగుతున్నానని.. తన దీక్షకు మద్దతివ్వాలనుకునే వారు కనీసం మూడు నిమిషాలైనా దీక్ష చేయాలని ఆయన కోరారు. విభజన హామీలను ఆగస్టు 15లోపు హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్నారు కేఏ పాల్. తాను అధికారంలోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడి తెస్తానన్నారు కేఏ పాల్.