హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ వైర్‌లెస్ టెక్నాలజీ ప్రొవైడర్ సిలికాన్ ల్యాబ్స్ హైదరాబాద్‌లోని సలార్‌పురియా సత్వ నాలెడ్జ్ సిటీలోని ఆఫీసును బుధవారం ప్రారంభించింది. ఇది సిలికాన్ ల్యాబ్స్ ఇంజనీరింగ్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఇనోవేషన్‌కు అతిపెద్ద గ్లోబల్ సెంటర్‌గా పనిచేస్తుంది. అత్యాధునిక ఐఒటి వైర్‌లెస్ ప్రాడక్ట్‌లను, ఇండస్ట్రియల్, కమర్షియల్, హోం, లైఫ్, అప్లికేషన్లను, సొల్యూషన్‌లను అభివృద్ధి చేసే టీమ్ హైదరాబాద్‌లో ఉంటుంది.
ఈ ఆఫీసును తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సిలికాన్ ల్యాబ్స్ ప్రెసిడెంట్ సీఈఓ మాట్ జాన్సన్‌లు ప్రారంభించారు. సిలికాన్ ల్యాబ్స్ ఇండియా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మనీష్ కొఠారీ, సిలికాన్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికాన్ ల్యాబ్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో దాదాపు 500 మంది ఉద్యోగులను హైదరాబాద్ కార్యాలయం కోసం నియమించింది. 2025 నాటికి వీరి సంఖ్యను1,500 మందిని నియమించుకోనుంది. ఈ ఆఫీసు కోసం 850 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.