ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు.. సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు.. సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. 

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో ఇవాళ  మహంకాళి బోనాలు, రేపు  రంగం, అంబారీ కార్యక్రమం ఉంటుంది. భక్తుల దర్శనానికి ఆరు  క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేట్ పెట్టారు.

 అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చే వారితో పాటు ఐదుగురికి అనుమతి ఉంటుంది. వీరికి రెండు క్యూలైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరెంజ్ చేశారు. మరో రెండు లైన్లు దేవాలయం  పాసులు జారీ చేసిన వారికోసం ఏర్పాటు చేశారు. 

Also Read:-సోషల్ మీడియాలో రీల్స్ కోసం.. బైక్ స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టు్కున్నాడు