వేములవాడ, వెలుగు: వేములవాడలో సోమవారం విశాల పట్టు చీరల షాపింగ్ మాల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరోహీరోయిన్కార్తికేయ, నేహశెట్టి హాజరై జ్యోతి వెలిగించి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు వేముల శ్రీనివాస్, వేముల విష్ణు, వేముల వెంకటేశ్వర్లు సినీనటులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోయిన్ నేహశెట్టి మాట్లాడుతూ వేములవాడలోని విశాల షాపింగ్‌లో మగ్గాలపై నేసిన వెరైటీ పట్టుచీరలు అందుబాటులో ఉన్నాయన్నారు.
నిర్వాహకులు మాట్లాడుతూ వేములవాడలో 30 ఏండ్లుగా కస్టమర్లకు నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నామన్నారు. షాపింగ్‌మాల్ లో ప్రతి గంటకు ఒకసారి డ్రా తీసి 1 గ్రామ్గోల్డ్ అందిస్తున్నామన్నారు. హీరోహీరోయిన్లను చూసేందుకు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు.