సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్.. వేలంలో లక్ష రూపాయలు

సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్.. వేలంలో లక్ష రూపాయలు

సిల్క్ స్మిత(Silk smitha).. 80 దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ పేరొక సంచలనం. తన మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్ల గుండెలను అయస్కాంతంలా ఆకర్షించింది ఈ బ్యూటీ. ఆ కాలంలో సినిమాల్లో ఐటెం సాంగ్ అంటే గుర్తొచ్చేది సిల్క్ స్మితనే.  సిల్వర్ స్క్రీన్ పై తన అంద చందాలతో మాయ చేసింది ఈ బ్యూటీ. ఆ కాలంలో ఆమెకు చాలా క్రేజ్ ఉండేది. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా సరే సిల్క్ ఐటెం సింగ్ ఉండాల్సిందే. సినిమాలో ఆమె ఉందంటే అది సూపర్ హిట్ అంతే.. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియతే చేసింది సిల్క్.

అయితే ఆ కాలంలో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జామ్పుల్ చాలు. అదేంటంటే.. సిల్క్ స్మిత విషయంలో తమిళ అభిమానుల తీరు చాలా భిన్నంగా ఉండేది. ఒక కిళ్ళీ తెచ్చి ఆమెను కొరికి ఇమ్మని తెగ బ్రతిమిలాడుకునేవారట. కొన్నీళ్ల పాటు అదో ట్రెండ్ లా నడిచింది. అలా ఒకసారి.. 1984లో ఓ సినిమా షూటింగ్ పాల్గొంది స్లీక్. షూట్ బ్రేక్‌లో యాపిల్ తింటూ ఉండగా.. షాట్ రెడీ అని సిల్క్‌ను పిలిచారట. సగం కొరికిన యాపిల్‌ను అక్కడ పెట్టే సిల్క్ షూట్ కు వెళ్లిందట.

Also Read :- OTTలోకి సూపర్ హిట్ బెదురులంక.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

సిల్క్ స్మిత కొరికిన ఆ యాపిల్‌ను.. ఆమె మేకప్‌మ్యాన్ అక్కడికక్కడే వేయగా.. సెట్లో ఉన్నవాళ్ళు ఆ యాపిల్ ను పోటీపడ్డారట. ఇక చివరికి సిల్క్ కోరికోన ఆ యాపిల్ రూ. 26 వేల నుండి లక్ష రూపాయల వరకు పలికిందని సమాచారం. అది సిల్క్ రేంజ్ అంటే. దాదాపు 38 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.