Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ రిలీజ్.. అందంతో అంచనాలు పెంచిన చంద్రిక రవి

Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ రిలీజ్.. అందంతో అంచనాలు పెంచిన చంద్రిక రవి

సిల్క్ స్మిత (Silk Smitha) జీవితం ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలు రాగా, తాజాగా మరో బయోపిక్ రూపొందుతోంది. గతేడాది 2023 డిసెంబర్ 2న సిల్క్ స్మిత జయంతి సందర్భంగా ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చింది.

పాన్ ఇండియా స్థాయిలో ‘సిల్క్ స్మిత’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సిల్క్ స్మిత ‘అన్‌‌‌‌‌‌‌‌టోల్డ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌.

జయరామ్ అనే కొత్త దర్శకుడు సిల్క్ స్మిత మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఎస్‌‌‌‌‌‌‌‌ బి విజయ్ (STRI సినిమాస్ సంస్థ) నిర్మిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో అలరించిన చంద్రిక రవి (Chandrika Ravi) సిల్క్ స్మిత క్యారెక్టర్ చేస్తోంది. 

ALSO READ | Pushpa2 Bookings: బుకింగ్స్ తోనే అరాచకం.. రిలీజ్కు ముందే పుష్ప 2 ఊచకోత

లేటెస్ట్ విషయానికి వస్తే.. సోమవారం (2024 డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతి సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అచ్చు సిల్క్ స్మితలానే కనిపిస్తోంది చంద్రిక. చీర ధరించి, పెద్ద కళ్ళతో గోళ్లు కొరుకుతూ ప్రజెంట్ చేసిన లుక్‌‌‌‌‌‌‌‌లో సిల్క్ స్మితలా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా రిలీజైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అంచనాలు పెరిగిపోయాయి.

ఇకపోతే.. అలనాటి స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్స్ చేసిన సిల్క్ స్మిత.. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా, పర్సనల్‌‌‌‌‌‌‌‌గా చాలా కష్టాలను చూశారు. 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకున్నారు. 17 సంవత్సరాలు, ఐదు భాషలు, 450 సినిమాలు. ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని సంఘటనలను ఇందులో చూపించబోతున్నారు మేకర్స్.