రాబోయే కాలానికి చుక్కల్లో వెండి ధర.. ఎందుకంటే?

రాబోయే కాలానికి చుక్కల్లో వెండి ధర.. ఎందుకంటే?

కామన్‌గా బంగారం ధర పెరిగితుంది. వెండి ధర పెరుగుదలను పెద్దగా పట్టించుకోరు. రానున్న రోజుల్లో బంగారం ధర స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేసింది ఓ ఫైనాన్షియల్ కంపెనీ. అయితే రాబోయే 12 నుంచి15 నెలల్లో కేజీ వెండి ధర రూ.లక్షా 25వేల వరకు వెళ్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ అంచనా వేసింది.

Also Read :- బంగారం ధర భారీగా తగ్గడం అంటే ఇది

 అంటే 2025 డిసెంబర్ లేదా 2026 మార్చి నాటికి లక్ష 25 వేల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. డిమాండ్ కూడా అలాగే ఉందని స్పష్టం చేసింది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ.  ప్రస్తుతం.. అంటే 2024, అక్టోబర్ 28వ తేదీన కిలో వెండి లక్షా 7 వేల రూపాయలుగా ఉంది. కొనుగోళ్లకు మంచి డిమాండ్ ఉంది.. కొన్నాళ్లు వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నా.. లక్ష రూపాయల దగ్గర స్థిరమైన ధరను మెయిటెన్ చేస్తుంది.

పెరుగుదలకు ఇవే కారణాలు :

  • అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లలో కోత విధించటం ఒక కారణం. 
  • పశ్చిమాసియా దేశాలు అయిన ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య యుద్ధ వాతావరణం.
  • ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం.. 
  • ఈ కారణాలతో పెట్టుబడులు అన్నీ బంగారం, వెండి వంటి మెటల్ వైపు వెళుతున్నాయి.