న్యూఢిల్లీ: వెండి ధర ఢిల్లీలో గురువారం కిలోకు రూ. 4,900 పడిపోయి రూ.90,900లకు చేరింది. బుధవారం కూడా ఇది రూ.5,200 తగ్గింది. బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 78,700కి పడిపోయింది. స్టాకిస్టులు విపరీతంగా అమ్మడంతో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల ధర గురువారం రూ.400 తగ్గి రూ.78,300కి చేరుకుంది. 99.9 శాతం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.వంద తగ్గి రూ.78,700 వద్ద ముగిసింది.
ఈ నెల నాలుగో తేదీన కూడా వెండి రూ. 4,600 క్షీణించింది. ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేటు నిర్ణయంపై అనిశ్చితి, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లను పెంచుతామని ప్రకటించడంతో బంగారం, వెండికి డిమాండ్ చాలా తక్కువగా ఉందని వ్యాపారులు తెలిపారు.