కిలో వెండి ల‌క్ష రూపాయ‌లు అవుతుందా.. ఇప్పుడెంత‌?

కిలో వెండి లక్ష రూపాయలు అవుతుందా.. రాబోయే కొన్ని నెలల్లో వెండి.. బంగారం కంటే ఖరీదు అవుతుందా.. లక్ష రూపాయలు లేనిదే.. కిలో వెండి కొనలేమా.. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే అదే జరగొచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం.. అంటే జులై 17వ తేదీ హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 81 వేల 800 రూపాయలుగా ఉంది.. కొన్ని రోజులుగా వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. 

నాలుగు రోజులుగా రూ.4 వేల 800 పెరిగింది

హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు మండిపోతున్నాయి. గత మూడు రోజుల్లోనే ఏకంగా కిలో వెండి రేటు రూ. 4 వేల 800  మేర పెరిగింది. అయితే జులై 17న  మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ. 81 వేల 800 మార్క్ వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది.  అక్కడ నాలుగు రోజులుగా రూ.4 వేల100కి  పెరిగింది. 

ALSOREAD :మహేష్ సినిమాకు మళ్ళీ బ్రేక్.. ఇలా అయితే ఎలా అన్నా?

ప్రస్తుతం కిలో వెండి రేటు ఢిల్లీలో రూ. 77 వేల 500 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం గోల్డ్​తో పాటు సిల్వర్​పై కూడా పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే కిలో వెండి ధర ఇప్పుడు లక్ష రూపాయలు దాటి పోతోందా అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేమంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను బట్టి రేట్లల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చని అంటున్నారు.  ఇదే విధంగా మరో నెల రోజులు ధరల పెరుగుదల కొనసాగితే.. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి కిలో వెండి లక్ష రూపాయల వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు వ్యాపారులు.

పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్​లో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దాని ధర రూ.60 వేల మార్కుని చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్​ 10 గ్రాముల గోల్డ్​ ధర రూ.55 వేలను చేరుకుంది.