వాడినా వాడకపోయినా కొన్నాళ్లకు వెండి వస్తువులు నల్లబడటం సహజం. మరి వాటికి మునుపటి మెరుపు రావాలంటే.. ఈ టిప్ ఫాలో అవ్వాల్సిందే.
టిప్..
- స్టీల్ గిన్నెలో సరిపడా నీళ్లు పోసి నల్లబడ్డ వెండి గిన్నెలు, గ్లాసులు వేయాలి.
- అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వస్తువుల్ని బట్టి వంటసోడా వేసి మరిగించాలి.
- నీటి బుడగలు తేలుతున్నప్పుడు ఆ నీళ్లలో సిల్వర్ ఫాయిల్ని ఉండలుగా చుట్టి వేయాలి.
- తర్వాత ఓ మాదిరి మంట మీద సిల్వర్ ఫాయిల్ బ్లాక్ కలర్ లోకి మారేవరకు (దాదాపు ఇరవై నిమిషాలు). మరిగించి స్టవ్ ఆపేయాలి.
- ఆ తరువాత గిన్నె మీద మూతపెట్టి గంట తర్వాత చూస్తే సిల్వర్ ఫాయిల్స్ మరింత నల్లగా మారతాయి.
- వెండి గిన్నెలు మెరుస్తాయి. అయితే ఈ ప్రాసెస్లో మూలాల్లో నలుపు కొంచెం మిగిలే ఉంటుంది.
- అలాంటప్పుడు టూత్ బ్రష్ పై కొంచెం కోలెట్ పేస్ట్ వేసి నలుపు వదలని మూలల్లో రుద్దితే నలుపంతా పోతుంది.
- ఆ తర్వాత వాటిని కాసేపు చన్నీళ్లలో ఉంచి, పొడి క్లాత్తో తుడిస్తే తళతళా మెరుస్తాయి.
- అయితే ఇందుకు కేవలం స్టీల్ గిన్నెని మాత్రమే వాడాలి.