
మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే చిత్రాలతో హీరోగా గుర్తింపును అందుకున్నాడు కీరవాణి రెండో కొడుకు శ్రీసింహా. ఇప్పుడు ‘ఉస్తాద్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించింది.
ఇప్పటికే టీజర్, రెండు పాటలను విడుదల చేయగా.. తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘చుక్కల్లోంచి తొంగి చూసే చక్కనైన జాబిల్లి.. పక్కకొచ్చి కూర్చున్నది అయ్య బాబోయ్ ఏం చెయ్యాలి.. ’ అంటూ సాగే పాటలో శ్రీసింహా, కావ్య క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. అకీవా.బి కంపోజ్ చేసిన పాటకు రహమాన్ అందమైన లిరిక్స్ రాశాడు. కార్తీక్ పాడిన తీరు, విజువల్స్ ఆకట్టుకున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది.