దేవుడు లేడనే వాళ్లు ఉంటారు. కానీ వెలుగు, వేడి లేవని... వాటికి కారణమైన సూర్యుడు లేడని ఎవరూ అనరు అనలేరు కూడా. కుల, మత, జాతి, దేశ తేడాలు లేకుండా అన్ని విశ్వాసాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండేది సూర్యుడు. ప్రత్యక్షదైవం, లోక సాక్షి, జీవుల చావుపుట్టుకలకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి.. ఇలా అన్నింటికీ మూలం ఆది నారాయణుడే. సూర్యుడు లేకపోతే సృష్టే ఉండదు. ఆయన లేని లోకాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు.
ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని భక్తి భావంతో కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం అంతలా ఉంది. జీవుల ఉనికి, మనుగడకు ఆధారం సూర్యుడే కాబట్టి అందులో ఆశ్చర్య పదాల్సిన విషయం లేదు. సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని ఉత్తరాయణంలోకి ప్ర వేశించటానికి సూచనగా రెండు పండుగలను జరుపుకుంటారు. వాటిలో ఒకటి సంక్రాంతి ప్రతి ఏడాది జనవరి నెల మధ్యలో జరుపుకుం టారు. రెండోది రధసప్తమి మాఘశుద్ధ సప్తమి సూర్యుని జన్మతిథి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనపుడు మాఘశుద్ధ సప్తమి రోజు రధసప్తమి జరుపుకుంటారు.
ఆదర్శం
సర్వ సమానత్వానికి సూర్యుడు ప్రతీక. రాజు,పేద అనే తేడా ఆయనకు ఉండదు. పూరి గుడిసెలు, రాజసౌధాలపై ఒకేలా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తారు. నిరుపేదల్లో, ధనవంతుడిలో ఒకే విధమైన చైతన్యాన్ని నింపుతాడు. విధి నిర్వహణలో కూడా సూర్య భగవానుడే అందరికీ ఆదర్శం. సూర్యోదయ, అస్తమయాల్లో ఎప్పుడూ సమయాన్ని అతిక్రమించడు.
Also Read :- చలిలో వ్యాయామం ఇబ్బందిగా ఉందా..? అయితే ఇలా చేయండి
సృష్టిలోని సంపదలకు, విద్యా విజ్ఞా నాలకు ఆయనే మూల పురుషుడు. సూర్యుడి వల్లే సంపద కలుగుతుందనడానికి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా సూర్య నమస్కారాలతో కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి ఆలోచనా ప్రక్రియను నియంత్రిస్తాయి.
అందరూ సమానమే
మనలోపలే ఉన్న అజ్ఞాత శక్తుల గురించి మనకు తెలియదు తెలియకుండా చేసేదే మాయ. నేను ఎవరు? అని ప్రశ్నించుకుని ఒక్క సారి మన ఆలోచనను, చూపును లోపలికి మరలించుకున్నామంటే అసలు సత్యం తెలుస్తుంది. వెలుపలి సూర్యుడి కంటే వెయ్యిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నారు. అలాగే జ్ఞానవివేకాలు కూడా మన లోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డుపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం. సూర్యుడి ముందు ఏలా అందరం సమానమో మనుషులో కూడా అలాంటి తేడా ఉండకూడదనేదే సూర్యుడు మనకు తెలిపే సత్యం.
== వెలుగు లైఫ్