RR vs KKR: రాజస్థాన్‌కు బుర్ర లేదు.. రూ.11 కోట్లిచ్చి 8వ స్థానంలో ఆడిస్తున్నారు: మాజీ క్రికెటర్

RR vs KKR: రాజస్థాన్‌కు బుర్ర లేదు.. రూ.11 కోట్లిచ్చి 8వ స్థానంలో ఆడిస్తున్నారు: మాజీ క్రికెటర్

ఐపీఎల్ సీజన్ 18 లో రాజస్థాన్ రాయల్స్ ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన రెండు మ్యాచ్ లో ఆ జట్టును పరాజయాలే పలకరించాయి. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్.. బుధవారం (మార్చి 26) కోల్ కతా రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కనీస పోటీ ఇవ్వకుండానే ఓటమిపాలయింది. సొంతగడ్డపై ఓడిపోవడం రాజస్థాన్ కు పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఓటమిపై మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ సైమన్ డౌల్ స్పందించాడు. స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్ మేయర్ ను రాజస్థాన్ సరిగ్గా వినియోగించుకోలేదని మండిపడ్డాడు. 

రాజస్థాన్ రాయల్స్ వ్యూహాలను సైమన్ డౌల్ ప్రశ్నించాడు. స్టార్ బ్యాటర్లు ఔటైన తర్వాత జట్టు యాజమాన్యం షిమ్రాన్ హెట్‌మైర్‌ను 8వ స్థానంలో ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించాడు. " రాజస్థాన్ జట్టు షిమ్రాన్ హెట్మైర్‌ను ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్ లో చివర్లో పంపిస్తున్నారు. రూ.11 కోట్ల రూపాయలకు అతన్ని రిటైన్ చేసుకున్నారు. మ్యాచ్ లో అతన్ని 8వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. హెట్ మేయర్ గయానా తరపున 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. ఇదో చెత్త ప్రణాళిక. దూబేను ఎందుకు హెట్ మేయర్ కంటే ముందు బ్యాటింగ్ కు పంపిస్తున్నారు".అని క్రిక్‌బజ్‌లో మాట్లాడుతూ డౌల్ అన్నాడు.

Also Read :- భారత 'ఎ' జట్టులో ట్రిపుల్ సెంచరీ వీరుడు

సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హెట్ మేయర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ మ్యాచ్ లో 23 బంతుల్లోనే నాలుగుకు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. గౌహతీ వేదికగా నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 8 స్థానంలో వచ్చి 8 బంతుల్లో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. అతని కంటే ముందు బ్యాటింగ్ కు వచ్చిన దూబే, హసరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్ లో  కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది.

ఓపెనర్ క్వింటన్ డి కాక్ (61 బంతుల్లో 97: 8 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటి చేత్తో కేకేఆర్ ను గెలిపించాడు. మరోవైపు టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది.