బైల్స్‌‌ స్వర్ణాల ఖాతా తెరిచింది

 బైల్స్‌‌ స్వర్ణాల ఖాతా తెరిచింది

అమెరికా లెజెండరీ జిమ్నాస్ట్‌‌ సిమోన్ బైల్స్‌‌ పారిస్‌‌ ఒలింపిక్స్‌‌లో స్వర్ణాల ఖాతా తెరిచింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌ టీమ్ ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ఫైనల్లో  బైల్స్‌‌  వాల్ట్‌‌, అన్‌‌ఈవెన్‌‌ బార్స్‌‌, బ్యాలెన్స్‌‌ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ నాలుగింటిలోనూ సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. దాంతో అమెరికా గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఇటలీ, బ్రెజిల్‌‌ రజతం, కాంస్యం గెలిచాయి.