ఆ పాత్రల కంటే ఆంటీ పాత్రలే బెటర్‌‌‌‌ : సిమ్రాన్

ఆ పాత్రల కంటే ఆంటీ పాత్రలే బెటర్‌‌‌‌ : సిమ్రాన్

ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌‌లలో స్టార్ హీరోయిన్‌‌గా రాణించింది సిమ్రాన్. ఆ తర్వాత కెరీర్‌‌‌‌లో కొంత గ్యాప్ ఇచ్చిన ఆమె.. రీఎంట్రీ తర్వాత క్యారెక్టర్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌గా బిజీగా ఉంది. ఇటీవల జరిగిన ఓ అవార్డ్‌‌ ఫంక్షన్‌‌లో ఆమె చేసిన కామెంట్స్‌‌ వైరల్‌‌ అవుతున్నాయి. తనతో ఈక్వెల్‌‌గా కెరీర్‌‌‌‌ కొనసాగించిన ఓ నటితో జరిగిన డిస్కషన్‌‌ గురించి ఆమె ప్రస్తావించింది. నాకు బాగా తెలిసిన తోటి నటి ఓ చిత్రంలో చాలా బాగా నటించింది. అది చూసి ఆశ్చర్యపోయి మెసేజ్ చేశాను. 

తన పెర్ఫార్మెన్స్ బాగుందని చెబుతూనే ఇలాంటి పాత్రలు ఎందుకు ఎంచుకుంటున్నావని అడిగాను.  ఆంటీ రోల్స్‌‌లో నటించడం కంటే ఇలాంటివి ఎంతో ఉత్తమం అని ఆమె చులకనగా రిప్లై ఇచ్చింది.  ఈ వేదిక ద్వారా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే.  ‘పనికిమాలిన డబ్బా రోల్స్‌‌లో నటించడం కంటే, ఆంటీ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ పనిచేసినా ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలి’ అని స్ట్రాంగ్‌‌ కౌంటర్‌‌‌‌ ఇచ్చింది సిమ్రాన్. ఇంతకూ సిమ్రాన్‌‌ కౌంటర్ ఇచ్చిన ఆ నటి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆమధ్య ‘డబ్బా కార్టెల్‌‌’ అనే వెబ్‌‌ సిరీస్‌‌లో జ్యోతిక నటించడంతో తన పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. అలాగే ‘శబ్ధం’లో నటించిన  లైలా పేరుతో పాటు స్నేహ, అంజలి సహా పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇంతకూ సిమ్రాన్‌‌ ఎవరిని టార్గెట్‌‌ చేసిందో..!