WPL మినీ వేలంలో జాక్ పాట్ కొట్టిన సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ షేక్‌

WPL మినీ వేలంలో జాక్ పాట్ కొట్టిన సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ షేక్‌

బెంగళూరు: ముంబై క్రికెటర్‌‌‌‌‌‌‌‌ సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ షేక్‌. విమెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌) వేలంలో అత్యధికంగా రూ. 1.90 కోట్ల ధర పలికింది. ఆదివారం జరిగిన ఈ మినీ ఆక్షన్‌‌‌‌‌‌‌‌లో 120 మంది వేలంలోకి  రాగా, వివిధ ఫ్రాంచైజీల్లో ఖాళీగా ఉన్న 19 మందిని తీసుకున్నారు. దియోంద్ర డాటిన్‌‌‌‌‌‌‌‌ను (రూ. 1.70 కోట్లు) గుజరాత్‌‌‌‌‌‌‌‌ దక్కించుకుంది. ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లలో ఈమెకే అత్యధిక ధర కావడం విశేషం. జి. కమిలిని (రూ. 1.60 కోట్లు) ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసింది. ప్రేమ రావత్‌‌‌‌‌‌‌‌ రూ. 1.20 కోట్లకు బెంగళూరుకు వెళ్లింది. ఎన్‌‌‌‌‌‌‌‌. చరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ రూ. 55 లక్షలకు దక్కించుకుంది. చరణితో పాటు ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన సారా బ్రైసీ, నిక్కి ప్రసాద్‌‌‌‌‌‌‌‌ను కూడా తీసుకున్నారు. 

2023 డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌లో యూపీ వారియర్స్‌‌‌‌‌‌‌‌కు ఆడిన సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ కోసం ఢిల్లీ, గుజరాత్‌‌‌‌‌‌‌‌ చివరి వరకు పోటీపడ్డాయి. 2023లో రూ. 60 లక్షలకే గుజరాత్‌‌‌‌‌‌‌‌కు ఆడిన డాటిన్‌‌‌‌‌‌‌‌కు ఈసారి మాత్రం విపరీతమైన డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఏర్పడింది. అయితే ఇండియా వెటరన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ స్నేహ్‌‌‌‌‌‌‌‌ రాణాను ఎవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన రాఘవి బిస్త్‌‌‌‌‌‌‌‌, జోత్స్నను ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ దక్కించుకున్నాయి. జాగ్రవి పన్వర్‌‌‌‌‌‌‌‌ను ముంబై కొనుగోలు చేసింది. డిక్లెర్క్‌‌‌‌‌‌‌‌, ఆక్షత మహేశ్వరి, సంస్కృతి గుప్తా కూడా ముంబై టీమ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు.