
జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఇండోనేసియా ఓపెన్‌లో నిరాశ పరిచింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లోనే సింధు 15–21, 21–15, 14–21తో సు వెన్ చి (చైనీస్‌తైపీ) చేతిలో ఓడింది. సు వెన్ చేతిలో సింధు ఓడటం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 18–21, 6–21తో ఇంటనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. విమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–15, 21–15తో జాకీ డెంట్–క్రిస్టల్ లాయ్ (కెనడా)పై నెగ్గగా, రుతుపర్ణ–శ్వేతపర్ణ 12–21, 9–21తో కిమ్ సో యెంగ్–కాంగ్ హి (కొరియా) చేతిలో ఓడారు.