లక్నో: ఇండియా స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్–300 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సింధు 21–12, 21–9తో ఇండియాకే చెందిన ఉన్నతి హుడాపై నెగ్గింది. 36 నిమిషాల మ్యాచ్‌లో సింధు తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆకట్టుకుంది. అనుభవలేమితో ఇబ్బందిపడ్డ హుడా వరుసగా అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. దీంతో ఏ దశలోనూ సింధుకు పోటీ ఇవ్వలేకపోయింది. మెన్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ లక్ష్యసేన్ 21–8, 21–14తో షాగో ఓగ్వా (జపాన్)పై నెగ్గాడు.
విమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్–ట్రీసా జోలీ 18–21, 21–18, 21–0తో బెనియప్ప అమిసార్డ్–నుతకర్ణ్ అమిసార్డ్ (థాయ్‌లాండ్)పై, మిక్స్‌డ్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 21–16, 21–15తో జో జి హంగ్–యాంగ్ జీ హి (చైనా)పై, మెన్స్ డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయి ప్రతీక్ 21–17, 17–21, 21–16తో ఇషాన్ భట్నాగర్–శంకర్ ప్రసాద్‌పై నెగ్గి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించారు.