కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమెను ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా ఎస్పీగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ జిల్లాలోని మామూనూర్4వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న సింధూశర్మను ఇక్కడికి ఎస్పీగా బదిలీ చేశారు. గతంలో జగిత్యాల ఎస్పీగా పనిచేశారు. ఇక్కడ పనిచేసిన ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డిని ఇటీవల ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.