బీఆర్​ఎస్​ సింగరేణిని నిర్వీర్యం చేస్తే.. కాంగ్రెస్​ కార్మికులకు బోనస్​ ఇచ్చింది: ఉపముఖ్యమంత్రి భట్టి

బీఆర్​ఎస్​ సింగరేణిని నిర్వీర్యం చేస్తే.. కాంగ్రెస్​ కార్మికులకు బోనస్​ ఇచ్చింది: ఉపముఖ్యమంత్రి భట్టి

ప్రజాభవన్​ లో సింగరేణి కార్మికులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనస్​ చెక్కులను పంపిణీ చేశారు.  కాంగ్రెస్​ప్రభుత్వం ప్రకటనలే పరిమితం కాకుండా సింగరేణిలో వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్​ ను పండుగ కంటే ముందే ఇచ్చామన్నారు. సింగరేణి కార్మికుల అన్ని అవసరాలను తీరుస్తామన్నారు.  

సింగరేణిలో నిర్మాణాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు.  ప్రభుత్వ రంగ సంస్థలకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేసిందన్నారు.  నష్టాల్లో ఉన్న ఆర్టీసీని...  కాంగ్రెస్​ ప్రభుత్వం  రూ. 400 కోట్లు ఇచ్చి బతికిస్తుందన్నారు.  సింగరేణి సేవలను  ఇతర రంగాల్లోకి విస్తరించాలన్నారు.   కార్మికులకు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల అభివృద్దికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  

Also Read :- మేం వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చాం

బీఆర్​ఎస్​ ప్రభుత్వం  అరకొరగా పంచితే.. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన లాభాలను అధికారికంగా ప్రకటించి కార్మికుల అభివృద్దికి ఎంత కేటాయిస్తున్నామో... పబ్లిక్​ గా ప్రకటించామన్నారు.   కాంగ్రెస్​ ప్రభుత్వం కార్మికుల్లో లాభాల్లో భాగస్వామ్యం చేసిందన్నారు.  40 వేల మంది కార్మికులు.. మరో 20 వేల మంది కాంట్రాక్ట్​ పద్దతిన సింగరేణిలో పని చేస్తున్నారని భట్టి తెలిపారు. సింగరేణిలో బొగ్గు తవ్వకాల ఖర్చును తగ్గించాలన్నారు.

 ప్రతి బొగ్గు బావి దగ్గర దసరా పండుగ ముందు  కార్మికులకు విందు ఏర్పాటు చేయాలని సింగరేణి జీఎంను ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క ఆదేశించారు.  సింగరేణి భవిష్యత్తును నిర్ణయించే అధికారం కార్మికులదేనన్నారు.  కాంట్రాక్ట్​ కార్మికుల శ్రమ దోపిడి జరుగుతుందంటూ... వారి జీతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగరేణి సెగ్మంట్​లలో పైలట్​ ప్రాజెక్ట్​ యంగ్​ ఇండియా స్కూల్స్​ను ప్రారంభిస్తామన్నారు. సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికుల పెన్షన్​ విషయాన్ని పరిశీలించి వారికి కూడా న్యాయం చేస్తామన్నారు.