ప్రమాద రహిత సింగరేణిగా మార్చాలి: మైన్స్​ సేఫ్టీ డైరెక్టర్​ నాగేశ్వరరావు

ప్రమాద రహిత సింగరేణిగా మార్చాలి: మైన్స్​ సేఫ్టీ డైరెక్టర్​ నాగేశ్వరరావు
  • గోదావరిఖనిలో రామగుండం రీజియన్ రక్షణ అవగాహన సదస్సు

గోదావరిఖని, వెలుగు :  అన్ని రక్షణ చర్యలు పాటిస్తూ ప్రమాదాలు లేని సంస్థగా సింగరేణిని మార్చాలని  ​మైన్స్​సేఫ్టీ(డీఎంఎస్​)  డైరెక్టర్ ​ఎన్​.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖనిలోని ఆర్జీ –1 ఏరియా కాన్ఫరెన్స్​హాల్​లో రామగుండం రీజియన్​స్థాయిలో నిర్వహించిన రక్షణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గనుల్లో రక్షణపై పని ప్రదేశాల్లో స్లొగన్స్ ఏర్పాటుతో పాటు తాగునీరు, రెస్ట్ షెల్టర్స్, ఫస్ట్ ఎయిడ్ షెల్టర్లను కల్పించాలని సూచించారు. 

మోడ్రన్ టెక్నాలజీ వినియోగించి రూఫ్​లు కింద పడకుండా, సైంటిఫిక్ స్టడీ చేస్తూ పర్యవేక్షిస్తూ ఉండాలని పేర్కొనారు. జీరో హర్మ్ .. జీరో ఆక్సిడెంట్ ..  లక్ష్యంగా  జాగ్రత్తతో పని చేయాలని సూచించారు. ఈ సదస్సులో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ బానోతు వెంకన్న, కార్పొరేట్ సేఫ్టీ .ఈఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ –1 జీఎం డి.లలిత్ కుమార్, ఆర్జీ –3 జీఎం ఎన్.సుధాకర్ రావు, ఏపీఎ జీఎం నాగేశ్వర రావు, రెస్క్యూ జీఎం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.