3 నిమిషాల్లోనే 6 వేల అడుగులకు పడిపోయిన విమానం..అసలేం జరిగిందంటే.?

గాల్లో ఉండగానే ఫ్లైట్ భారీ కుదుపులు వస్తే ఎలా ఉంటుందో మనం చాలా  సినిమాల్లో చూశాం. ఒక్కసారిగా ఫ్లైట్ తలకిందులవడం..ఫ్లైట్ కిందకు పడిపోవడం వంటి ఘటనలు చూశాం.  అయితే ఇవాళ మే 21న జరిగిన  సింగపూర్ ఎయిర్ లైన్స్ విమాన ఘటన హాలీవుడ్ సినిమాను తలపిస్తోంది. 

బోయింగ్ 777 విమానం లండన్ నుంచి సింగపూర్ కు వెళ్తుండగా  మయన్మార్‌కు వెళ్లే మార్గంలో అండమాన్‌ సముద్రంలో ప్రయాణిస్తుండగా భారీ కుదుపులకు గురైంది. ఒక ప్రయాణికుడు చనిపోయాడు, ఈ ఘటనను సింగపూర్ ఎయిర్ లైన్స్ కూడా ధృవీకరించింది.

 ప్రమాద ఘటనను  FlightRadar లో రికార్డ్ అయిన వీడియోను సింగపూర్ ఎయిర్ లైన్స్ తన ఫేస్ బుక్ లో ట్విట్టర్లో పోస్ట్ చేసింది.  విమానం 37వేల అడుగుల ఎత్తులో వెళ్తుండగా  ఒక్కసారిగా  మూడు నిమిషాల్లోనే 6 వేల అడుగుల కిందకు పడిపోయింది. అంతా తలకిందులయ్యింది.  విమాన సిబ్బంది సైతం ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి వీలు లేకుండా పోయింది. విమానంలో ఉన్న లగేజీ కిందపడిపోయింది. చిన్నాభిన్నం అయిపోయింది. వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి.  భారీ కుదుపులతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. తేరుకునే లోపే అందులో ఒకరు చనిపోయారు. 30 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషలో మీడియాలో వైరల్ అవుతోంది.