అమెరికాను మించిపోయిన సింగపూర్​

ఒకటేమో ప్రపంచంలోనే పవర్​ఫుల్​ కంట్రీ. అతి పెద్ద దేశాల్లో మూడోది కూడా. మరొకటేమో ఇంటర్నేషనల్​ బిజినెస్​ సెక్టార్​లోని నాలుగు ఆసియా సింహాల్లో ఒకటి. దక్షిణాసియాలోని చిన్న దేశమూ అదే. ఈ రెండూ ‘పోటీ’లోకి దిగితే ఎవరు ముందుంటారు?. సహజంగా పెద్దది, శక్తిమంతమైనదే పైచేయి సాధిస్తుంది. కానీ.. ఇక్కడ సీన్​ రివర్స్ అయింది. చిన్నదే స్పీడ్​గా దూసుకుపోయింది. వెనకబడ్డ దేశం అమెరికా కాగా, దాన్ని ఓవర్​టేక్​ చేసింది సింగపూర్​ కావటం విశేషం.

ఎకానమీ అభివృద్ధికి సంబంధించి ఇతర దేశాలు అందుకోలేని ఎత్తున ఉండే అమెరికా ఈసారి బోల్తా కొట్టింది. గతేడాది మాదిరిగా పెర్ఫార్మెన్స్​ ఇవ్వలేకపోయింది. బిజినెస్​కు అన్నిరకాలుగా, అనుకూలంగాఉండే దేశాన్ని కాంపిటీటివ్​ కంట్రీగా చెబుతారు. గ్లోబల్​ కాంపిటీటివ్​  ఇండెక్స్​లో కిందటేడాది నెం–1​ ప్లేస్​లో నిలిచిన అమెరికా ఇప్పుడు రెండో మెట్టు దగ్గరే ఆగిపోయింది.  సింగపూర్​ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. మోడ్రన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కి తోడు​ లేబర్​, మేనేజ్​మెంట్​ మధ్య కో–ఆపరేషన్​ అద్భుతంగా ఉండటం సింగపూర్​కి కలిసొచ్చింది. వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) చేపట్టిన స్టడీలో మొత్తం 141 దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటీపడి సింగపూర్​ తనకుతానే సాటి అని నిరూపించుకుంది. గ్లోబల్​ కాంపిటీటివ్​ రిపోర్ట్​లో తానే టాప్ అని ​ చాటుకుంది. మొత్తం 103 అంశాలపై నివేదికను రూపొందించగా, ముఖ్యంగా రెండు అంశాల్లో అమెరికా వెనకబడింది.  సింగపూర్​లో ఆరోగ్యవంతమైన జీవిత కాలం, 21వ శతాబ్దానికి కావల్సిన స్కిల్స్​ ఉన్నాయని, అమెరికా ఆ దిశగా ప్రయత్నించడం లేదని రిపోర్ట్​ పేర్కొంది.

ఇన్నోవేషన్​లో ముందుంటే తిరుగుండదు

టాప్​–5 దేశాల్లో అమెరికా తర్వాత హాంకాంగ్​, నెదర్లాండ్స్​, స్విట్జర్లాండ్​లకు చోటు లభించింది. ర్యాంకులను నిర్ణయించటానికి డబ్ల్యూఈఎఫ్​ 103 ఇండికేటర్లను బేస్​ చేసుకుంది. వాటిని హెల్త్​, ఫైనాన్షియల్​ సిస్టమ్​, మార్కెట్​ సైజ్​, బిజినెస్​ డైనమిజం, ఇన్నోవేటివ్​ కెపాసిటీ వంటి 12 కేటగిరీలుగా విభజించింది. అమెరికా మిగతా ఇండికేటర్లలో ఎలా ఉన్నప్పటికీ ఇన్నోవేటివ్​ పవర్​ హౌస్​గా మరోసారి తన పొజిషన్​ని నిలుపుకుంది.

కాంపిటీటివ్​ ఎకానమీగా అగ్రస్థానం​లో నిలబడాలంటే ఇన్నోవేషన్​లో ముందుండటం చాలా ముఖ్యమని డబ్ల్యూఈఎఫ్​ ఫౌండర్​ క్లాజ్​​ ష్కాబ్​ అభిప్రాయపడ్డారు. వరల్డ్​ ఎకానమీలో ఏడాది కాలంగా కొన్ని ఆపరేటివ్​ ఫ్యాక్టర్లు కీలకంగా మారాయని, వాటి ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయటం తొందరపాటు అవుతుందని రిపోర్ట్​ని రూపొందించినవారు అంటున్నారు. అమెరికా, చైనా ట్రేడ్​ వార్​ ముదురుతుండటంతో ట్రిలియన్​ డాలర్ల విలువైన సరుకుల​పై దిగుమతి టారిఫ్​లు ఆకాశాన్ని అంటుతున్నాయని గుర్తు చేశారు.

ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం

రెండు దేశాల వ్యాపార తగాదాలు మూడో దేశానికి అనుకూలంగా మారుతున్నాయి. బిజినెస్​ విషయంలో చైనాకు ఆల్టర్నేటివ్​ ఏంటా అని చూస్తున్నారు. ఇలా ఆలోచించేవారికి వెంటనే వియత్నాం కనిపిస్తోంది. 2018లో కాంపిటీటివ్​ ఇండెక్స్​లో 77వ ర్యాంక్​ తెచ్చుకున్న ఈ దేశం ఏడాదిలోనే పది పాయింట్లు పెరిగి 67కి చేరింది. ఇద్దరు కొట్టుకోవటం మూడోవాడికి లాభమనటానికి ఇదే నిదర్శనమని డబ్ల్యూఈఎఫ్​ అనుబంధ సంస్థ ‘సెంటర్​ ఫర్​ ది న్యూ ఎకానమీ అండ్​ సొసైటీ’ హెడ్​ సాదియా జాహిది అన్నారు. చైనా–అమెరికా ట్రేడ్​ వార్​ నేపథ్యంలో వియత్నాం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇన్వెస్ట్​మెంట్లను ఆకర్షిస్తోంది. తద్వారా రీజనల్​ ట్రేడింగ్​ హబ్​గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాంపిటీటివ్​నెస్​పై టారిఫ్​ల పూర్తి ప్రభావాన్ని అనాలసిస్​ చేయటానికి సరిపోయే సమాచారం అందుబాటులో లేదని జాహిది చెప్పారు. అయితే బిజినెస్​ సెంటిమెంట్​ తగ్గుముఖం పట్టడానికి రెస్ట్రిక్టివ్​ ట్రేడ్​ మెజర్సే కారణమని తెలిపారు. వీటివల్లే ఈసారి ర్యాంకుల్లో ఇండియా పది పాయింట్లు దిగజారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.