20 ఏండ్ల తర్వాత పదవి దిగిపోతుండు

సింగపూర్: ప్రధానిగా వచ్చే నెల 15న తప్పుకుంటానని సింగపూర్  ప్రధాని లీ సేన్  లాంగ్  (72) ప్రకటించారు. తన బాధ్యతలను డిప్యూటీ ప్రధాని లారెన్స్  వాంగ్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ట్విటర్ లో ఆయన వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చినట్లే వాంగ్ కు కూడా అండగా నిలవాలని సింగపూర్  ప్రజలను ఆయన కోరారు. మరింత మెరుగైన సింగపూర్  భవిష్యత్తు కోసం వాంగ్ తో కలిసి పని చేయాలని సూచించారు. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్  21న రాజీనామా చేస్తానని ఇంతకుముందు ఆయన వెల్లడించారు. కానీ, ఈలోపే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. 2004లో సింగపూర్  ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1965లో సింగపూర్​కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ముగ్గురే ప్రధాన మంత్రులుగా పనిచేశారు.