సింగపూర్ అంటే ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుర్తొస్తుంది. అందుకు తగ్గట్టే ఒక సర్వేలో సింగపూర్ జనం బాగా అలసిపోతున్నారని రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ రిపోర్ట్‌లో అలసట లెవల్స్ చార్ట్‌తో పాటు.. వర్కింగ్ అవర్స్, ఇంటర్నెట్ మీద పనిచేస్తున్న టైంకు సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. ఇందులో సింగపూర్ వాసులకు నిద్ర ఏమాత్రం సరిపోవట్లేదని తేలింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పని కోసమే ఆలోచిస్తారట.ఈ పని అలసటలో వీళ్ల స్కోర్ పదికి 7.2. కాగా మెక్సికో7.01, బ్రెజిల్ 6.28 లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉన్నవాళ్లనే ఈ స్టాటిస్టిక్స్‌లో చేర్చారు.
అయితే నిద్రపోయే గంటలు ఎక్కువ ఉన్నంత మాత్రాన పని అలసట తక్కువ అని ఈ డేటా ఉద్దేశం కాదు. ఏడాది మొత్తంగా ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉన్నది మాత్రం మెక్సికోలో. ఈ లిస్ట్‌లో మెక్సికో 2,255 గంటలతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సింగపూర్ 2,238, చైనా 2,174 గంటలతో తర్వాతి ప్లేసెస్‌లో ఉన్నాయి. అలసట విషయంలో చైనా తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. పనిచేయడం కోసమే ఇంటర్నెట్ వాడటంలో రోజుకు 9 గంటల 29 నిమిషాలతో బ్రెజిల్ మొదటి ప్లేస్‌లో ఉంది. తర్వాత మెక్సికో 8 గంటల1 నిమిషం, సింగ పూర్ 7 గంటల 2 నిమిషాలతో ఉన్నాయి.