ఘన్‌‌పూర్‌‌కు డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి : సింగపురం ఇందిర

స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌, వెలుగు : జనగామ జిల్లాలో ఏకైక డివిజన్‌‌ కేంద్రమైన స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌కు డిగ్రీ కాలేజీ,  వంద పడకల హాస్పిటల్‌‌ మంజూరు చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర కోరారు. ఈ మేరకు బుధవారం సెక్రటేరియట్‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని ఇందిర చెప్పారు.