అధికారుల ఆధ్వర్యంలోనే ఈసారీ సింగరాయ జాతర

అధికారుల ఆధ్వర్యంలోనే ఈసారీ సింగరాయ జాతర

కోహెడ, వెలుగు: మండలంలోని కూరెల్ల గ్రామ శివారులో  జరిగే  సింగరాయ జాతరపై  కూరెల్ల,తంగళ్లపల్లి గ్రామాల మధ్య  పదేండ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. కాగా ఈనెల 9న  జాతర జరగనుండగా..   పోలీస్​, రెవెన్యూ అఫీసర్లు  ఇరు గ్రామాల వారితో  బుధవారం తహసీల్దార్​ ఆఫీస్​లో సమావేశం నిర్వహించారు. పదేండ్ల నుంచి జాతర సరిహద్దును ఎందుకు పరిష్కరించడం లేదని అధికారుల తీరుపై  ఇరు గ్రామాల ప్రజలు  అసహనం వ్యక్తం చేశారు.

   సరిహద్దు సమస్య పరిష్కారం కాకపోవడంతో  ఈసారి కూడా రెవెన్యూ, పోలీస్​ ఆధ్వర్యంలోనే జాతరను నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. ఇందుకు ఇరు గ్రామాల వారు సహకరించాలని కోరారు. జాతర అనంతరం  సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  అధికారులకు సహకరించి జాతరను సక్సెస్​ చేయాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్​ సురేఖ, సీఐ కిరణ్, ఎస్ఐ తిరుపతి, ఎంపీపీ కీర్తి, ఎంపీవో సురేశ్, ఎంపీటీసీ స్వామి తదితరులు​ ఉన్నారు.