గోదావరిఖని, వెలుగు : సింగరేణి 136వ ఆవిర్భావ వేడుకలు సోమవారం రామగుండం రీజియన్‌లో ఘనంగా నిర్వహించారు. గోదావరిఖనిలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం, యైటింక్లయిన్‌కాలనీలోని అబ్దుల్‌కలాం స్టేడియం, సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో రీజియన్ జీఎంలు డి.లలిత్‌కుమార్, బి.వెంకటయ్య, ఎన్.సుధాకర్‌రావు, వెంకటేశ్వర్లు, సేవా ప్రెసిడెంట్లు అనిత, వనజ సంస్థ జెండాలను ఎగరేసి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం సింగరేణి ప్రగతిని వివరించేలా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లు, ఫుడ్ కోర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ హాజరై మాట్లాడారు.
ఆయా కార్యక్రమాల్లో వివిధ సంఘాలకు చెందిన లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, కె.స్వామి, జీగురు రవీందర్, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, ఆఫీసర్లు గోపాల్‌సింగ్, కిరణ్‌బాబు, పొనుగోటి శ్రీనివాస్, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఉత్తమ ఉద్యోగులు, ఆఫీసర్లను జీఎంలు సన్మానించారు.