- గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు
- స్ట్రక్చరల్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థ కార్మికులకు ఇన్సెంటివ్పాలసీ అమలుకు మేనేజ్ మెంట్ ఒప్పుకుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు తెలిపారు. కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులోని సింగరేణి బంగ్లాలో ఏఐటీయూసీ నేతలు, సింగరేణి అధికారుల మధ్య గురువారం స్ట్రక్చరల్మీటింగ్జరిగింది. ఇందులో సంస్థ డైరెక్టర్, ముఖ్య ఆఫీసర్లతో పాటు ఏఐటీయూసీ నేతలు కార్మిక సమస్యలపై చర్చించారు. కంపెనీ సీఎండీ ఎన్. బలరాం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మాట్లాడారు. సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతలో యూనియన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఉత్పత్తి లక్ష్య సాధనకు యూనియన్లు తమ పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీటింగ్‌లో చర్చించిన అంశాలను ఏఐటీయూసీ నేతలు యూనియన్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్సెక్రటరీ కె. రాజ్‌కుమార్ వివరించారు. కార్మికులకు కొత్త ఇన్సెంటివ్ పాలసీని ప్రవేశపెట్టడంతో పాటు ప్లే డేస్, పీహెచ్డీలలో ఎన్–1పాలసీని రద్దు చేయాలని కోరినట్టు తెలిపారు. కోల్‌బెల్ట్ ఏరియా రామగుండంలోని మెడికల్కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు 25శాతం మెడికల్ సీట్లు రిజర్వ్చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.
కార్పొరేషన్ మెడికల్‌బోర్డు ద్వారా అండర్‌గ్రౌండ్ కు అనర్హులుగా ప్రకటించిన మైనింగ్‌స్టాఫ్, ట్రేడ్స్‌మెన్, ఈపీ ఆపరేటర్లకు సూటబుల్జాబ్ఇవ్వాలని.. సర్ఫేస్పై తగిన పని కల్పించాలని.. మెరిట్స్కాలర్ షిప్‌ను రూ. 50వేలకు పెంచాలని, సింగరేణిలో తొలగించిన జేఎంఈటీలతో పాటు ఇతరులను తిరిగి తీసుకోవాలనే సమస్యలపై చర్చించినట్టు వివరించారు. స్టాఫ్‌కు ప్రమోషన్లు కల్పించాలని, వీటితోపాటు పలు సమస్యలను మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ సమావేశంలో జీఎం ఐఆర్అండ్పీఆర్ఎం. కవితానాయుడు, జీఎం ఐఈపీ సురేష్‌బాబు, జీఎం వెల్ఫేర్ కె. శ్రీనివాసరావు, యూనియన్ నేతలు పాల్గొన్నారు