సింగరేణికి స్పెషల్ క్యాంపెన్ అవార్డు

సింగరేణికి స్పెషల్ క్యాంపెన్ అవార్డు
  •  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సీఎండీ బలరాం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్ క్యాంపెన్ 4.Oలో ఎక్కువ ప్రాంతాలను పరిశుభ్రపర్చిన (మ్యాగ్జిమమ్ నంబర్ ఆఫ్ సైట్స్ క్లీన్డ్) విభాగంలో సింగరేణికి అవార్డు వరించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిల్లీలో నిర్వహించిన చింతన్ శివిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ ఎన్.బలరాం ఈ అవార్డును అందుకున్నారు. 

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోలిండియా, అనుబంధ సంస్థలు, నైవేలీ లిగ్నైట్ సంస్థల్లో నిరుడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2వ తేదీ నుంచి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31 వరకు స్పెషల్ క్యాంపెన్ 4.0 పేరిట స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టింది. 

ఇందులో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 157 చోట్ల పరిసరాలను పరిశుభ్రం చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా, 216 ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టింది. దీంతో ఎక్కువ సంఖ్యలో ప్రదేశాలను శుభ్రపర్చిన విభాగంలో సింగరేణికి ఈ పురస్కారం లభించింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరాం మాట్లాడుతూ.. పరిశుభ్రతకు సింగరేణి పెద్దపీట వేస్తుందని చెప్పారు.