- ఈ ఏడాది -రికార్డు స్థాయిలో బొగ్గు, కరెంట్అమ్మకాలు
- ఫిబ్రవరి నాటికే దాటేసిన గతేడాది టర్నోవర్
- 12 శాతం వృద్ధి సాధిస్తామని మేనేజ్‌మెంట్ ప్రకటన
- అధిక లాభాలపై కార్మికుల్లో ఆశలు
కోల్‌బెల్ట్, వెలుగు: ఈ ఏడాది -రికార్డు స్థాయి బొగ్గు, కరెంట్ అమ్మకాలతో సింగరేణి సంస్థ రూ.37వేల కోట్ల బిజినెస్ దిశగా దూసుకుపోతోంది. మరో 10 రోజుల్లో ఫైనాన్స్ఇయర్ముగుస్తుండగా.. గతేడాది కన్నా 12శాతం ఎక్కువ టర్నోవర్సాధిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 30 నాటికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి రీచ్కావడంతో పాటు రవాణా, విద్యుత్ అమ్మకాల్లోనూ లక్ష్యం చేరుకోనుంది. ఈసారి బిజినెస్పెరిగినందున ఆ మేరకు లాభాలు పెరిగి, తమ వాటా కూడా పెరుగుతుందని కార్మికులు ఆశిస్తున్నారు.
బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో జోరు
సింగరేణి సంస్థ ఈ యేడు బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో రూ.37వేల కోట్ల టర్నోవర్దాటే ఛాన్స్ కనిపిస్తోంది. 2022-–23లో రూ.33 వేల కోట్ల వ్యాపారం చేసిన సంస్థ.. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్ ఫిబ్రవరి నాటికే గత యేడాది టర్నోవర్‌ను దాటింది. నిరుడు 66 మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయగా... ఈ యేడు 70 మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టార్గెట్ మార్చి చివరి నాటికి రీచ్ కానుండగా.. రూ.37వేల కోట్లకు పైగా టర్నోవర్ దాటేఅవకాశం కనిపిస్తోంది. గతయేడాది కన్నా 12శాతం వృద్ధితో రూ.4 వేల కోట్ల టర్నోవర్‌ను అధికంగా సాధించే వీలుంది. ఇందులో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.32,500 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,500 కోట్ల టర్నోవర్ ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. థర్మల్ పవర్‌తో పాటు సోలార్ పవర్‌ను కూడా ఉత్పత్తి చేసి అమ్మకాలు జరుపుతుండడంతో టర్నోవర్ పెంచుకుంటోంది.
పెరగనున్న లాభాలు
2023–-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో నిర్దేశించిన 70 మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తి కోసం సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రోజుకు 2.45 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి, రవాణా టార్గెట్‌గా పెట్టింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్ బలరాంనాయక్, డైరెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఏరియాల వారీగా లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు రవాణా చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. గత యేడాది 33వేల కోట్ల టర్నోవర్ చేసిన సింగరేణి సంస్థ రూ.1,222 కోట్ల లాభాలు ఆర్జించింది. ఈసారి మరో12 శాతం వృద్ధితో రూ.37 వేల కోట్ల టర్నోవర్ దాటే ఛాన్స్ ఉండటంతో లాభాలు కూడా అదే స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంది.-------