జనవరి14 రోజున సీఈఆర్ ​క్లబ్ ​మూత

  •     కార్మికులకు ఆటలను దూరం చేసిన మేనేజ్‌‌‌‌మెంట్
  •     మిగతా రోజులు తెరిచి.. ఆదివారం మూయడంపై కార్మికుల అసంతృప్తి

గోదావరిఖని, వెలుగు : సింగరేణి కార్మికులకు ఆటపాటలు దూరమవుతున్నాయి. స్పోర్ట్స్‌‌, కల్చరల్ ​ప్రోగ్రామ్స్‌‌తో కార్మికుల్లో మానసికోల్లాసాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన కాలరీ ఎంప్లాయీస్​ రిక్రియేషన్‌‌‌‌ (సీఈఆర్‌‌‌‌) క్లబ్‌‌‌‌ సరిగా పనిచేయడం లేదు. ఆదివారం సింగరేణికి సెలవు రోజు కాగా క్లబ్‌‌‌‌ను మూసివేసింది.  మూడు నెలలుగా ఇలాగే మూసేస్తుండడంతో కార్మికులు ఆటపాటలకు దూరమవుతున్నారు. అయితే మిగతా రోజులు క్లబ్​ తెరిచే ఉంటోంది. 

వెయ్యిమందికి మెంబర్‌‌‌‌షిప్‌‌

గోదావరిఖనిలో నివాసముంటూ ఆర్జీ 1 ఏరియాతో పాటు ఆర్జీ 2, ఆర్జీ 3, శ్రీరాంపూర్‌‌‌‌ ఏరియాలలోని గనులు, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌ల్లో కార్మికులు పనిచేస్తుంటారు. అయితే వీరిలో సుమారు వెయ్యి మంది వరకు కార్మికులు గోదావరిఖనిలోని సీఈఆర్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో మెంబర్‌‌‌‌ షిప్‌‌‌‌ కలిగి ఉన్నారు. వీరి నుంచి నెలకు రూ.20 చొప్పున మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌ రూపంలో శాలరీలో కట్‌‌‌‌ చేస్తున్నారు. కార్మికులు వారికి అనుకూల టైంలో క్లబ్‌‌‌‌కు వచ్చి అక్కడ క్యారమ్స్‌‌‌‌, చెస్‌‌‌‌, షటిల్‌‌‌‌, టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌, బ్యాడ్మింటన్‌‌‌‌, జిమ్‌‌‌‌, ఇతర గేమ్స్‌‌, కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్​ చేస్తుంటారు.

ఆదివారం బొగ్గు గనులు, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లు, డిపార్ట్‌‌‌‌మెంట్లకు సెలవు కావడంతో ఆ రోజు ఇంటి వద్ద ఉండే కార్మికులు క్లబ్‌‌‌‌కు వస్తుంటారు. అదే టైంలో మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ క్లబ్‌‌ను మూసేస్తుండడంతో వారంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. తమ వద్ద మెంబర్‌‌‌‌ షిప్‌‌‌‌ వసూలు చేస్తూ తమకు ఆటలను ఎందుకు దూరం చేస్తున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా కార్మికుల పిల్లలకు జిమ్‌‌‌‌ సౌకర్యం, ఇతర ఆటలను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఆడుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా వారి నుంచి కూడా నెలకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. రిటైర్డ్‌‌‌‌ కార్మికులకు నెలకు రూ.300, వారి పిల్లలకు రూ.900 వసూలు చేస్తున్నారు.