SLBC కార్మికుల సమాచారం రావాలంటే మరో రెండు రోజులు పడుతుంది: సింగరేణి CMD బలరాం

SLBC కార్మికుల సమాచారం రావాలంటే మరో రెండు రోజులు పడుతుంది: సింగరేణి CMD బలరాం

 ఎస్ఎల్బీసీ టన్నెల్ లో  చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందని సింగరేణి సీఎండి బలరాం తెలిపారు. NGRI ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ ఆధారంగా కార్మికులు ఉన్న కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. అయితే కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. 

రాడార్ పిక్చర్స్ వచ్చాకే కార్మికుల ఆచూకీ లభిస్తుందని అన్నారు. ఆచూకీ తెలియని కార్మికులను రాడార్ పిక్చర్స్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.  అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. 

SLBC టన్నెల్  లో చిక్కుకున్న కార్మికులను వెలికి తేసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  గురువారం (ఫిబ్రవరి 27) ఉదయం నుంచి రెస్క్యూ టీమ్‌‌లు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రెస్క్యూ టీమ్‌‌లు మొత్తం మూడు షిఫ్ట్‌‌లలో పనులు చేస్తున్నాయి.  టన్నెల్‌‌లోకి వెళ్లిన ప్రతీ టీమ్‌‌ సుమారు 12 గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ALSO READ : దళిత ఎంటర్ప్రెన్యూర్స్కు బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఇవాళ (శుక్రవారం ఫిబ్రవరి 28)  టన్నెల్ ఉన్న బేరింగ్ వద్దకు చేరకున్న రెస్క్యూ టీమ్.. బేరింగ్ ను గ్యాస్ కట్టర్లతో కట్ చేశారు. దాదాపు కార్మికులు ఉన్న చోటుకు దగ్గరికి వెళ్లారు. NGRI ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ ఆధారంగా కార్మికులు ఉన్న కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ తీయనున్నారు.