ఇటీవల రిటైరైన సింగరేణి కార్మికులకు బోనస్ : సీఎండీ బలరామ్

  • 27న రూ.18.27 కోట్లు ఖాతాల్లో జమ 

హైదరాబాద్, వెలుగు: ఇటీవల రిటైరైన కార్మికులకు దీపావళి బోనస్ విడుదల చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరామ్​ వెల్లడించారు. సంస్థలో  2023-=24 ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ 1, 2024 నుంచి అక్టోబరు 24, 2024 మధ్యలో  పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీమ్ (దీపావళి బోనస్) సొమ్మును విడుదల చేస్తున్నామని తెలిపారు. 

ఈనెల 27న  వారి ఖాతాల్లో బోనస్ సొమ్ము జమ అవుతుందని సింగరేణి సీఎండీ వెల్లడించారు. రిటైర్ అయిన 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి  గరిష్టంగా రూ.93,750 చొప్పున మొత్తం 18.27 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న వారి బ్యాంకు అకౌంట్​లలో జమ చేయడానికి తగిన  ఏర్పాట్లు  చేయాలని  అధికారులను ఆదేశించారు.