- ఎక్స్టెన్షన్ పై కోర్టు కెళ్లిన మాజీ కార్మికుడు
- కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కోల్ మినిస్ట్రీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్. శ్రీధర్ ఎక్స్టెన్షన్ చెల్లదంటూ కోల్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల స్టేట్ సీఎస్‌కు సెంట్రల్ కోల్ మినిస్ట్రీ లెటర్ రాసింది. నాలుగు రోజుల క్రితం ఇదే విషయాన్ని పేర్కొంటూ కోర్టులో అఫిడవిట్ సైతం దాఖలు చేసింది. ఐఏఎస్ ఆఫీసర్ ఎన్. శ్రీధర్ సింగరేణి సీఎండీగా 2015, జనవరి 1 నుంచి కొనసాగుతున్నారు. మూడేళ్ల కాలపరిమితితో శ్రీధర్ జాయిన్ అయ్యారు. అనంతరం స్టేట్గవర్నమెంట్ఆయన పదవీ కాలాన్ని ఎక్స్ టెన్షన్ చేస్తూ వస్తోంది. 51శాతం వాటా స్టేట్ సర్కార్, 49 శాతం వాటా సెంట్రల్ గవర్నమెంట్ సింగరేణిలో కలిగి ఉన్నాయి. స్టేట్, సెంట్రల్గవర్నమెంట్ల ఏకాభిప్రాయంతో సీఎండీ నియామకం జరగాల్సి ఉంది. అయితే 2020 డిసెంబర్30న జరిగిన కంపెనీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్‌లో సీఎండీగా మరోసారి శ్రీధర్ఎక్స్టెన్షన్కు కోల్మినిస్ట్రీ నుంచి వచ్చిన ప్రతినిధి ఒప్పుకోలేదు. దీంతో స్పెషల్ రిజల్యూషన్‌ను ఆర్డినరీ రిజల్యూషన్‌గా మార్చి సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగించేలా కమిటీలో మెంబర్లుగా ఉన్న కంపెనీ డైరెక్టర్లతో పాటు స్టేట్ఎనర్జీ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్రిజల్యూషన్ను ఆర్డినరీ తీర్మానంగా మార్చాలన్నా రెండు వారాల ముందు కోల్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్లు పేర్కొంటున్నారు. కాగా ట్రైపార్టెడ్అగ్రిమెంట్ప్రకారం సీఎండీగా కొనసాగాలంటే కోల్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. కోల్మినిస్ట్రీ నుంచి పర్మిషన్ లేకున్నా రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ శ్రీధర్ పదవీ కాలాన్ని ఎక్స్ టెన్షన్చేస్తూ జనవరి మొదటి వారంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోల్ మినిస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేట్సీఎస్కు జనవరి రెండో వారంలో లెటర్ రాసింది. శ్రీధర్ ఎక్స్‌టెన్షన్‌ను తాము ఒప్పుకోవటం లేదంటూ ఆ లెటర్లో పేర్కొంది. మరో వ్యక్తిని సూచించాలంటూ కోల్మినిస్ట్రీ సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవటం గమనార్హం.
హైకోర్టులో పిటిషన్
సీఎండీగా శ్రీధర్ కొనసాగటంపై కొత్తగూడెం పట్టణానికి చెందిన సింగరేణి మాజీ కార్మికుడు సంపత్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. సెంట్రల్ గవర్నమెంట్నుంచి పర్మిషన్ లేకుండా శ్రీధర్ కొనసాగుతున్నారని, 2018 సంవత్సరం నుంచి ఆయన తీసుకున్న వేతనాలను రికవరీ చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నాలుగు రోజుల కిందట కోల్మినిస్ట్రీ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. శ్రీధర్ ఎక్స్టెన్షన్ చెల్లదంటూ కోల్మినిస్ట్రీ ఈ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. సీఎండీగా ఐఏఎస్ఆఫీసర్ను స్టేట్గవర్నమెంట్ నియమించే అధికారం ఉంది. కేంద్రం, స్టేట్ గవర్నమెంట్మధ్య అగ్రిమెంట్ప్రకారం మూడేళ్ల కాలపరిమితితో నియమించుకోవచ్చు. అదనంగా మరో రెండేళ్లు పొడిగించుకోవచ్చు. ఎక్స్టెన్షన్చేసుకునే ముందు కోల్మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా స్టేట్ గవర్నమెంట్ అటువంటిదేమీ లేకుండానే ఎక్స్ టెన్షన్ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చిన ఎక్స్టెన్షన్ చెల్లదని కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేయడం సింగరేణిలో చర్చనీయాంశంగా మారింది. స్టేట్గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్టెన్షన్ఆర్డర్ చెల్లదని, రూల్స్‌కు విరుద్ధంగా కొనసాగుతున్న శ్రీధర్‌ను సీఎండీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) సైతం సెంట్రల్ గవర్నమెంట్‌కు, కోల్ మినిస్ట్రీకి లెటర్ రాసింది.
For More News..